విరుష్కల ' పెళ్లి సందడి'! | Newly weds Virat Kohli and Anushka Sharma wedding reception | Sakshi
Sakshi News home page

విరుష్కల ' పెళ్లి సందడి'!

Published Thu, Dec 21 2017 11:21 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

Newly weds Virat Kohli and Anushka Sharma wedding reception - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- బాలీవుడ్‌ నటి అనుష్క శర్మలు వివాహ బంధంతో ఒక్కటై  పది రోజులు గడుస్తున్నా ఇంకా వారి పెళ్లి సందడి మాత్రం కొనసాగుతోంది. ఇటీవల ఇటలీలో వివాహం చేసుకుని ఆపై హనీమూన్‌ కూడా అక్కడే జరుపుకున్న ఈ జంట.. బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ క్రమంలోనే గురువారం జరిగే తమ రిసెప్షన్‌ వేడుకకు మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ రోజు(డిసెంబర్‌ 21) న్యూఢిల్లీలో తమ బంధువుల కోసం విరాట​-అనుష్కల జోడి ప్రత్యేకంగా రిసెప్షన్‌ ఏర్పాటు చేశారు. దీనికి కేవలం బంధువులతో పాటు కొంతమంది రాజకీయ ప్రముఖుల హాజరయ్యే అవకాశం ఉంది. ఆపై ఈనెల 26న మరొక రిసెప్షన్‌ నిర్వహిస్తారు. ముంబైలో జరుగనున్న ఆ రిసెప్షన్‌కు క్రికెటర్లు, బాలీవుడ్‌ తారలతో పాటు మరికొంతమంది సెలబ్రెటీలు హాజరుకానున్నారు.


ఈ నెల 11వ తేదీన ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లి-అనుష్కలు హిందూ సంప్రదాయంలో వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ వివాహ కార్యక్రమానికి ఇరు కుటుంబాల బంధువులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం​ జరిగే రిసెప్షన్‌కు ఇరు కుటుంబాల బంధువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement