చాంపియన్స్ లీగ్లో ఒటాగో పరుగుల సునామీ | otago hits record score | Sakshi
Sakshi News home page

చాంపియన్స్ లీగ్లో ఒటాగో పరుగుల సునామీ

Published Wed, Sep 25 2013 6:16 PM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

otago hits record score

చాంపియన్స్ లీగ్లో ఒటాగో పరుగుల సునామీ సృష్టించి రికార్డు సాధించింది. బుధవారమిక్కడ పెర్త్ స్కార్చర్స్తో మ్యాచ్లో ఒటాగో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 242 పరుగులు చేసింది. చాంపియన్స్ లీగ్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఒటాగో ఓపెనర్ నీల్ బ్రూమ్ (56 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 117 నాటౌట్) మెరుపు సెంచరీతో చెలరేగాడు.

నీల్ బ్రూమ్తో పాటు టెన్ డష్కాటే (26 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 66) దూకుడుగా ఆడాడు. డెరెక్ డి బోర్డర్ 28 బంతుల్లో 45 పరుగులు చేశాడు. పారిస్ రెండు వికెట్లు తీశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement