కోల్‌కతా: ఇటీవల కాలంలో భారత క్రికెట్‌లో ఎక్కువగా చర్చకు దారి తీసిన అంశం ఏదైనా ఉందందే మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనికి యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ సరైన ప్రత్యామ్నాయమా.. కాదా అనేదే. కొంతకాలంగా రిషభ పంత్ ఘోరంగా విఫలం కావడంతో అతని భవిష్యత్తుపై అనేక సందేహాలు తలెత్తాయి. ధోనికి పంత్ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం కాదనే వాదనే ఎక్కువగా వినిపించది. కాగా, రిషభ్ పంత్‌ను హెడ్ కోచ్ రవిశాస్త్రి వెనకేసుకొచ్చినా అతని ఆట తీరు మాత్రం డైలమాలో పడేసింది.
ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా టెస్టు జట్టు నుంచి పంత్‌ను తప్పించి వృద్ధిమాన్ సాహాను తీసుకుంటారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. తాజాగా పంత్‌కు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన టీమిండియా మాజా కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతుగా నిలిచాడు. ప్రస్తుత భారత్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు పంత్ తప్ప వేరే చాన్స్ లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు కలిపి భారత్‌కు ఉన్న ఒకే సొల్యూషన్ పంత్. కొంతకాలంగా అతని షాట్ సెలక్షన్ ఆందోళన పరుస్తుంది. కానీ అతను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడు. కచ్చితంగా మెరుగవుతాడు. కెప్టెన్‌తో పాటు జట్టులోని మిగతా సభ్యులు కూడా పంత్‌కు అండగా నిలవాల్సి ఉంది. నా వరకూ అయితే అతని అంతర్జాతీయ అరంగేట్రాన్ని అద్భుతంగా ఆరంభించాడు. అతనొక మ్యాచ్ విన్నర్. సుదీర్ఘ కాలం భారత్‌కు ఆడే సత్తా అతనిలో ఉంది’ అని గంగూలీ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment