సాక్షి, హైదరాబాద్: సీఐఎస్‌సీఈ రీజినల్ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా నిర్వహించిన బాలుర స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అభ్యాస ఇంటర్నేషనల్ స్కూల్ స్విమ్మర్ రజత్ అభిరామ్ రెడ్డి సత్తా చాటాడు. సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో శనివారం జరిగిన అండర్–19 బాలుర 1500మీ. ఫ్రీస్టయిల్ విభాగంలో రజత్ చాంపియన్‌గా నిలిచి స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. కృష్ణకాంత్ (అభ్యాస స్కూల్) రజతాన్ని సొంతం చేసుకున్నాడు. 50మీ. ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో హర్షల్ గుప్తా (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్) విజేతగా నిలవగా... వైష్ణవ్ గౌడ్ (సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్), సాకేత్ అగర్వాల్ (అభ్యాస రెసిడెన్షియల్ స్కూల్) వరుసగా రజత, కాంస్య పతకాలను సాధించారు. ఈ పోటీల్లో సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ జట్టు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. స్టీఫెన్ కుమార్ వ్యక్తిగత విభాగంలో చాంపియన్‌షిప్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఏఎస్‌ఐఎస్‌సీ సంయుక్త కార్యదర్శి సుందరి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
∙50మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. వైభవ్, 2. పద్మేశ్, 3. రుషికేశ్. ∙50మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. స్టీఫెన్ కుమార్, 2. కవీశ్, 3. హర్షుల్ గుప్తా. ∙ 400మీ. ఫ్రీస్టయిల్: 1. రవితేజ, 2. శివరామ్, 3. కవీశ్. ∙50మీ. బటర్‌ఫ్లయ్: 1. సాకేత్ అగర్వాల్, 2. శివరామ్, 3. రవితేజ ∙ 100మీ. ఫ్రీస్టయిల్: 1. కవీశ్, 2. వైష్ణవ్, 3. కె. ధన్‌రాజ్. ∙100మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. రజత్ అభిరామ్, 2. వి. వైభవ్, 3. జి. పద్మేశ్. ∙100మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. స్టీఫెన్ కుమార్, 2. అలోసిస్ జెరోమ్, 3. సాకేత్ అగర్వాల్. ∙100మీ. బటర్‌ఫ్లయ్: 1. శివరామ్, 2. రవితేజ, 3. ల„Š్య. ∙200మీ. ఫ్రీస్టయిల్: 1. రవితేజ, 2. రుషి, 3. ల„Š్య. ∙200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. స్టీఫెన్ కుమార్, 2. జెరోమ్, 3. ధ్రువ్. ∙200మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. రజత్ అభిరామ్, 2. వైభవ్, 3. పద్మేశ్. ∙200మీ. బటర్‌ఫ్లయ్: 1. శివరామ్ ∙400మీ. మెడ్లీ: 1. కృష్ణకాంత్, 2. నచికేత్.
∙వ్యక్తిగత ఓవరాల్ చాంపియన్‌షిప్: 1. స్టీఫెన్ కుమార్, 2. రజత్ అభిరామ్, 3. కవీశ్.
Comments
Please login to add a commentAdd a comment