సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి టోర్నమెంట్ (ఐసీటీ) పురుషుల స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో సిద్ధార్థ డిగ్రీ, పీజీ కాలేజి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. బద్రుకా కాలేజి ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో సిద్ధార్థ జట్టు 16 పాయింట్లతో చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. 9 పాయింట్లు సాధించిన లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజి, అవినాశ్ డిగ్రీ కాలేజి జట్లు సంయుక్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో యశ్‌వర్మ (లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కాలేజి), వై. హేమంత్ రెడ్డి (అవినాశ్ కాలేజి), టి. సాయి తరుణ్ (సిద్ధార్థ డిగ్రీ కాలేజి) సత్తా చాటారు. వీరు ముగ్గురు ఆయా విభాగాల్లో తలా 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్నారు. 200 మీటర్ల మెడ్లే, 100 మీటర్ల బటర్‌ఫ్లయ్, 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్‌లలో యశ్ వర్మ విజేతగా నిలిచాడు. 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగాల్లో వై. హేమంత్ రెడ్డి చాంపియన్‌గా నిలిచాడు. 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 50 మీటర్ల బటర్ ఫ్లయ్, 50 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లలో సాయి తరుణ్ అగ్రస్థానంలో నిలిచి మూడు స్వర్ణాలను అందుకున్నాడు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో బద్రుకా ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ డైరెక్టర్ టీఎల్‌ఎన్ స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బద్రుకా కాలేజి ప్రిన్సిపాల్ సోమేశ్వర్ రావు, తెలంగాణ అక్వాటిక్ సంఘం కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇతర ఈవెంట్‌ల విజేతల వివరాలు
∙200 మీ. మెడ్లే: 1. యశ్ వర్మ (లిటిల్ ఫ్లవర్ కాలేజి), 2. సాత్విక్ నాయక్ (బద్రుకా), 3. చరణ్ (సెయింట్ జోసెఫ్).
∙100 మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. హేమంత్ రెడ్డి, 2. రోనక్ జైస్వాల్ (బద్రుకా), 3. సాయి ప్రసన్న (ప్రగతి మహావిద్యాలయ).
∙100 మీ. ఫ్రీస్టయిల్: 1. తేజస్విన్ (సిద్ధార్థ), 2. సుహాన్ (సెయింట్ జోసెఫ్), 3. గురునాథ్ (భవన్స్).
∙100 మీ. బటర్‌ఫ్లయ్: 1. యశ్‌వర్మ, 2. తేజస్విన్ (సిద్ధార్థ), 3. సాత్విక్ నాయక్ (బద్రుకా).
∙50 మీ. బ్యాక్‌స్ట్రోక్: 1. హేమంత్ రెడ్డి, 2. సాయిప్రసన్న (ప్రగతి), 3. సాయి లక్ష్మణ్ (భవన్స్).
∙100 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. యశ్‌వర్మ, 2. శశాంక్ యాదవ్ (ఎస్వీ డిగ్రీ కాలేజి), 3. చరణ్ (సెయింట్ జోసెఫ్).
∙50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్: 1. సాయి తరుణ్, 2. శశాంక్ యాదవ్ (ఎస్వీ డిగ్రీ కాలేజి), 3. సుహాన్ (సెయింట్ జోసెఫ్).
∙50 మీ. బటర్‌ఫ్లయ్: 1. సాయి తరుణ్, 2. తేజస్విన్ (సిద్ధార్థ), 3. గౌతమ్ సూర్య (బద్రుకా).
∙50 మీ. ఫ్రీస్టయిల్: 1. సాయి తరుణ్, 2. గురునాథ్ సాయి (భవన్స్ వివేకానంద), 3. సి. మనీశ్ (ఎస్పీ కాలేజి).
∙200 మీ. ఫ్రీస్టయిల్: 1. హేమంత్ రెడ్డి, 2. గౌతమ్ సూర్య (బద్రుకా), 3. సుహాన్ (సెయింట్ జోసెఫ్).
Comments
Please login to add a commentAdd a comment