రంజిత్, మయూఖాలకు రజతాలు
దోహా: ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత ట్రిపుల్ జంపర్ రంజిత్ మహేశ్వరి రజత పతకం సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్ ఫైనల్లో ఈ కేరళ అథ్లెట్ 16.16 మీటర్ల దూరం గెంతాడు. కజకిస్తాన్ అథ్లెట్ 16.69 మీటర్ల దూరం గెంతి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల ట్రిపుల్ జంప్‌లో భారత్‌కే చెందిన మయూఖా జానీ రజత పతకాన్ని నెగ్గింది. ఆమె 14 మీటర్ల దూరం గెంతి రెండో స్థానంలో నిలిచింది.
మహిళల 60 మీటర్ల హర్డిల్స్ విభాగంలో భారత అథ్లెట్ గాయత్రి గోవిందరాజ్ ఫైనల్‌కు అర్హత సాధించింది. మహిళల పెంటాథ్లాన్ ఈవెంట్‌లో రెండో స్థానం సంపాదించిన స్వప్నా బర్మన్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. పెంటాథ్లాన్ ఈవెంట్‌లో భాగమైన 800 మీటర్ల రేసు సందర్భంగా స్వప్న తన లైన్‌లో కాకుండా వేరే లైన్‌లో పరిగెత్తిందని ఇరాన్ అథ్లెట్ ఫిర్యాదు చేసింది. దాంతో విచారణ చేసిన తర్వాత అది నిజమని తేలడంతో నిర్వాహకులు స్వప్న ఫలితాన్ని రద్దు చేశారు. ఇప్పటివరకు ఈ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి.