న్యూఢిల్లీ: ఎప్పుడు సంచలన వ్యాఖ్యలు చేస్తు నిరంతరం వార్తలో నిలిచే వ్యక్తిగా బీజేపీ నేత, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు పొందిన విషయం తెలిసిందే. తాజాగా వన్డే క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లితో పోల్చితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గొప్ప ఆటగాడని ఓ టీవీ షోలో పేర్కొన్నాడు. కోహ్లి నైపుణ్యం కలిగిన ఆటగాడన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కానీ సచిన్‌తో పోల్చడాన్ని వ్యతిరేకిస్తానని తెలిపాడు. సచిన్ ఆడే సమయంలో నియమాలు చాలా కఠినంగా ఉండేవని.. ప్రస్తుత అధునాతన క్రికెట్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత క్రికెట్‌లో బౌలర్లు రివర్స్ స్వింగ్, ఫింగర్ స్విన్ వేయలేకపోతున్నారని.. అయిదుగురు ఫీల్డర్లు సర్కిల్‌లో ఉండడం బ్యాట్స్‌మెన్‌లకు అనుకూలంగా ఉన్నట్లు తెలిపాడు.
ఆధునిక క్రికెట్‌లో కోహ్లి అద్భుత ఆటతీరును కనబరుస్తున్నాడని ప్రశంసించాడు. కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో వెల్లడించిన ఓ ముఖ్య విషయాన్ని గంభీర్ పంచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లికి అవకాశం రావడానికి లంచం ఇవ్వాలని కొందరు కోహ్లి తండ్రి ప్రేమ్‌ను ఆశ్రయించగా ఆయన తిరస్కరించాడని.. తను కుమారుడు నైపుణ్యంతోనే జట్టులో చోటు సంపాధిస్తాడని కోహ్లి పంచుకున్న విషయాన్ని గంభీర్ గుర్తు చేశాడు. భారత దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సాధించని రికార్డులు లేవు. క్రికెట్ చరిత్రలో వంద సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచిన సచిన్ వన్డేల్లోనూ తొలి డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment