రోమ్ మాస్టర్స్ టోర్నీ
రోమ్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా-కారా బ్లాక్ (జింబాబ్వే) జోడి రోమ్ మాస్టర్స్ డబ్ల్యూటీఏ టోర్నమెంట్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్లో ఆరో సీడ్ భారత్-జింబాబ్వే జంట 6-3, 6-4తో డానియెల్ హంతుచొవ-మిర్జానా ల్యూసిక్ బెరోని జంటను కంగుతినిపించింది.
ఇక్కడే జరుగుతున్న రోమ్ మాస్టర్స్ ఏటీపీ టోర్నమెంట్‌లో భారత సీనియర్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న-ఐజాముల్ హక్ ఖురేషీ (పాకిస్థాన్) జోడి నిష్ర్కమించింది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన కవల సోదరులు మైక్- బాబ్ బ్రయాన్ జోడి చేతిలో పరాజయం చవిచూసింది. అన్‌సీడెడ్ ఇండో-పాక్ జంట 5-7, 1-6తో టాప్ సీడ్ అమెరికా ద్వయం చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. గంటా ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో బోపన్న-ఖురేషీ జోడి ఒక సారి ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయగలిగింది.
క్వార్టర్స్‌లో సానియా జోడి
Published Fri, May 16 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM
Advertisement
Advertisement