కోహ్లికి డబ్బే... డబ్బు | Virat Kohli, the new endorsement king beats mahendra singh Dhoni, Sachin Tendulkar in ad earnings | Sakshi
Sakshi News home page

కోహ్లికి డబ్బే... డబ్బు

Published Sat, Sep 28 2013 12:44 AM | Last Updated on Fri, Sep 1 2017 11:06 PM

కోహ్లికి డబ్బే... డబ్బు

కోహ్లికి డబ్బే... డబ్బు

న్యూఢిల్లీ: ఇప్పటికే భవిష్యత్ కెప్టెన్‌గా పేరు గడించిన యువ క్రికెటర్ విరాట్ కోహ్లి... వాణిజ్య ప్రకటనల్లోనూ తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఒక బ్రాండ్‌కు తీసుకుంటున్న వార్షికాదాయంలో సచిన్, ధోనిలను అధిగమించాడు.
 
 ఇటీవల   జర్మనీకి చెందిన ఓ స్పోర్ట్స్ ఉత్పత్తుల కంపెనీతో ఏడాదికి రూ. 10 కోట్లకు మూడేళ్ల పాటు ఒప్పందం చేసుకున్నాడు. అలాగే ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ కూడా పెద్ద మొత్తం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఇదే కంపెనీకి సచిన్, స్టీవ్ వాతో కూడా ఒప్పందం ఉంది. అయితే వీరిద్దరిని మించి కోహ్లికి చెల్లిస్తున్నారని వినికిడి. ఈ జోరు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో అత్యధిక సంపాదన కలిగిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచినా ఆశ్చర్యం లేదు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement