పాకిస్తానా.. సెమీస్‌ కూడా చేరదు | World Cup 2019 Harbhajan Picks His Semi Finalists | Sakshi
Sakshi News home page

పాకిస్తానా.. సెమీస్‌ కూడా చేరదు

Published Sat, May 18 2019 10:26 PM | Last Updated on Wed, May 29 2019 2:38 PM

World Cup 2019 Harbhajan Picks His Semi Finalists - Sakshi

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌ వేల్స్‌​ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌ 2019లో సెమీఫైనల్‌కు చేరే జట్లను టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ అంచనా వేశాడు. ఇంగ్లీష్‌ పిచ్‌లు, పరిస్థితులు, ప్రస్తుత జట్ల ఫామ్‌ను అంచనా వేసి సెమీఫైనలిస్టులను అంచనా వేసినట్లు భజ్జీ తెలిపాడు. అయితే తన అంచనా ప్రకారం పాకిస్తాన్‌ సెమీఫైనల్‌కు చేరదని స్పష్టం చేశాడు. పాక్‌తో పాటు దక్షిణాఫ్రికా కూడా లీగ్‌లోనే ఇంటి ముఖం పడుతుందని జోస్యం చెప్పాడు. అయితే తన జాబితాలో అనూహ్యంగా న్యూజిలాండ్‌కు అవకాశం ఇచ్చి ఆశ్చర్యపరిచాడు 

‘సమతుల్యంగా ఉన్న టీమిండియా ప్రపంచకప్‌ సెమీస్‌కే చేరడం పక్కా. స్వదేశంలో ఆడనుండటం ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం దీంతో ఇంగ్లండ్‌ సెమీస్‌ వరుకు చేరే అవాకశం ఉంది. ఆసీస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాలుగో స్థానం కోసం న్యూజిలాండ్‌కే నా ఓటు. ఇప్పటివరకు ప్రపంచకప్‌ గెలవకున్నా.. మెగాటోర్నీల్లో కివీస్‌ అద్భుతంగా ఆడుతుంది. పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్‌ చేరే అవకాశమే లేదు’అని హర్భజన్‌ జోస్యం చెప్పాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement