వాస్తవ రాజకీయాలను ఆవిష్కరించే కో-2 | actual politics of discovering Co -2 | Sakshi
Sakshi News home page

వాస్తవ రాజకీయాలను ఆవిష్కరించే కో-2

Published Wed, Jul 15 2015 2:58 AM | Last Updated on Sun, Sep 3 2017 5:29 AM

వాస్తవ రాజకీయాలను  ఆవిష్కరించే కో-2

వాస్తవ రాజకీయాలను ఆవిష్కరించే కో-2

 కో-2 చిత్రం వాస్తవ రాజకీయాలను ఆవిష్కరిస్తుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు. కో వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన ఆర్ ఎస్ ఇన్ఫోటెయిన్‌మెంట్ సంస్థ అధినేత ఎల్ రెడ్ కుమార్ తాజాగా దానికి సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. కో-2 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలసింహ, ప్రకాష్‌రాజ్, నిక్కీ గల్రాణీ, బాలా శరవణన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నవ దర్శకుడు శరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన దర్శకుడు విష్ణువర్ధన్ చక్రి తోలేటిల వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారన్నది గమనార్హం.
 
  ఈయన చిత్ర వివరాలను తెలుపుతూ చిత్రాన్ని తెరకెక్కించాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రస్తుత ట్రెండ్‌కు భిన్నంగా చిత్రం చేయాలని భావించానన్నారు. కో చిత్రం ఘన విజయం సాధించడంతో కో-2 చిత్రం తన బాధ్యతలను పెంచిందన్నారు. అదే విధంగా జాతీయ అవార్డు గ్రహీత నటులు బాబిసింహా, ప్రకాష్‌రాజ్‌లతో చిత్రం చేయడం అంత సులభం కాదన్నారు. నటుడు ప్రకాష్‌రాజ్ చిత్ర స్కిప్టును చదివి బాగుందంటూ ప్రశంసించారని తెలిపారు. ఈ చిత్రం ద్వారా ఎంనోజేమ్స్ అనే కొత్త సంగీత దర్శకుడిని పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. కో -2 నేటి రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
 

Advertisement

పోల్

Advertisement