చికెన్ చేయలేదని భార్య హత్య | chicken did not commit the murder of wife | Sakshi
Sakshi News home page

చికెన్ చేయలేదని భార్య హత్య

Published Tue, Aug 4 2015 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

chicken did not commit the murder of wife

శివమొగ్గ : భోజనానికి చికెన్ వండలేదంటూ కట్టుకున్న భార్యను హతమార్చిన వైనం శికారిపుర తాలూకాలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మత్తికోటె గ్రామంలో నివసిస్తున్న మునియబోవి, గౌరమ్మ(45) దంపతులు. హాసన్ జిల్లాలోని కాళేహళ్లికి చెందిన వీరు కొన్ని నెలల క్రితం మత్తికోటె చేరుకుని అల్లం సాగు చేస్తున్నారు. పొలం వద్దే రేకుల షెడ్ వేసుకుని జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం మునియబోవి మద్యం తీసుకుని ఇంటికి చేరుకున్నాడు.

అనంతరం దంపతులిద్దరూ కలిసి మద్యం తాగారు. అనంతరం భోజనానికి కూర్చొన్నారు. ఆ సమయంలో చికెన్ ఎందుకు వండలేదంటూ గౌరమ్మను మునియబోవి నిలదీశాడు. మాటామాట పెరిగి పక్కనే ఉన్న దుడ్డుకర్రతో భార్య తలపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement