అప్పుల బాధతో రైతు బలవన్మరణం
Published Wed, Nov 9 2016 3:20 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
వికారాబాద్: వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక రైతు అప్పులు తీరేదారి కానరాక ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక 12వ వార్డు మద్దులగడ్డతండాకు చెందిన పాండునాయక్(68)కు రెండెకరాల భూమి ఉంది. అందులో సోయా, మొక్కజొన్న సాగు చేశాడు. అయితే, శివారెడ్డిపేట్ సొసైటీ నుంచి తీసుకున్న రూ.1 లక్షతో పాటు ప్రైవేటుగా తీసుకున్న రూ.2 లక్షల అప్పు మిగిలి ఉంది. దీనికి తోడు ఈ ఏడాది పంటల పరిస్థితి ఆశాజనకంగా లేదు. దీంతో అప్పుతీరేదెలా అని కొద్దిరోజులుగా అతడు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకున్నాడు. వేకువజామున కుటుంబసభ్యులు చూసేసరికి విగతజీవుడై ఉన్నాడు. పాండునాయక్‌కు ఏడుగురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య జాకీభాయి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement