నేటి నుంచి పవర్ గ్రిడ్ ఎఫ్‌పీవో | power grid FPO from today onwards | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పవర్ గ్రిడ్ ఎఫ్‌పీవో

Published Tue, Dec 3 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:11 AM

నేటి నుంచి పవర్ గ్రిడ్ ఎఫ్‌పీవో

నేటి నుంచి పవర్ గ్రిడ్ ఎఫ్‌పీవో

ముంబై: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ చేపడుతున్న ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీవో) మంగళవారం మొదలుకానుంది. సంస్థాగత ఇన్వెస్టర్లకు ఆఫర్ ఈ నెల 5న ముగియనుండగా, కంపెనీ ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి 6 వరకూ బిడ్స్‌ను స్వీకరించనుంది. ఆఫర్‌కు రూ. 85-90 ధరను నిర్ణయించింది. ఉద్యోగులు, రిటైలర్లకు ధరలో 5% డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా కంపెనీ 17% వాటాను అమ్మకానికి పెట్టనుంది. తద్వారా రూ. 7,083 కోట్లను సమీకరించే అవకాశముంది. దీనిలో ప్రభుత్వం 4% వాటాను(18.51 కోట్ల షేర్లు) విక్రయించనుండగా, కంపెనీ 13%కు సమానమైన 60.18 కోట్ల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటిలో 2.4% వాటాను తమ ఉద్యోగులకు కేటాయించనుంది.

 

  వెరసి కంపెనీ రూ. 5,717 కోట్లను సమీకరించనుండగా, ప్రభుత్వానికి రూ. 1,758 కోట్లు లభించనున్నాయి. కాగా,సోమవారం బీఎస్‌ఈలో షేరు ధర 1.7% క్షీణించి రూ. 93.40 వద్ద ముగిసింది. నిధులను విస్తరణ ప్రాజెక్ట్‌లకు వె చ్చించనున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్‌ఎన్ నాయక్ చెప్పారు. ఆఫర్‌లో 50% వాటాను సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15%ను సంపన్న వర్గాలకు, 35%ను రిటైల్ విభాగానికి కేటాయించింది. ఇష్యూ తరువాత కంపెనీలో ప్రభుత్వ వాటా 69.42% నుంచి 57.89%కు తగ్గనుంది. ఇంతక్రితం కంపెనీ అంటే 2010 నవంబర్‌లోనూ రూ. 90 ధరలో ఎఫ్‌పీవోను చేపట్టిన విషయం విదితమే. అప్పుడు 10% వాటాను విక్రయించింది.

Advertisement
Advertisement