-
కులగణనపై ఈటల కీలక వ్యాఖ్యలు
సాక్షి,యాదాద్రి భువనగిరి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణన ఒక డ్రామా అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.యాదగిరిగుట్టలో ఆదివారం(ఫిబ్రవరి16) ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.‘బీసీ గణనను చట్టబద్దమైన సంస్థలతో సర్వే చేసి అసేంబ్లీలో చట్ట బద్దత కల్పించాలి. బీసీ కుల గణనకు బీజేపీ వ్యతిరేకం కాదు.కులగణనను పార్లమెంట్లో ఆమోదించేందుకు సిద్దంగా ఉన్నాం. 70ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీ సీఎం కూడా లేడు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ అంటేనే స్కామ్‌లు, భూ దందాలు,లంచాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డబ్బు సంచులతో ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల చుట్టూ తిరుగుతున్నాడు.ప్రధాని మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చిల్లరగా ఉన్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంది. బీఆర్ఎస్ గతంలో టీచర్లను మోసం చేసి పోటీ చేసే అర్హత కోల్పోయింది’అని ఈటల అన్నారు. -
‘ఎమ్మెల్సీలు గెలిస్తే సంచలనమే’
సాక్షి,నిజామాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేక అరువు తెచ్చుకున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. నిజామాబాద్‌లో ఆదివారం(ఫిబ్రవరి16) నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో లక్ష్మణ్ మాట్లాడారు.‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దించేందుకు కాంగ్రెస్‌కు అభ్యర్థులు కరువయ్యారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కొమురయ్య, అంజిరెడ్డిలను గెలిపించాలి. ఎన్నికల విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు సంభవించే అవకాశం ఉంది.కులగణన పేరుతో చిచ్చు పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారు. బీసీ హక్కులను,రిజర్వేషన్లను ముస్లింలకు అప్పజెప్పే పనిలో ఉన్నారు. బీఆర్ఎస్ గురించి మాట్లాడే పనిలేదు. వాళ్ల దుకాణం బంద్ అయింది.ఎంపీ అర్వింద్ కామెంట్స్హిందూ రాష్ట్ర స్థాపనే నా లక్ష్యంఎన్నికలు ఏవైనా..ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారుప్రపంచానికి దిక్సూచిగా మారిన మోదీ కులం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటుదేశాన్ని కాపాడుకోవాలంటే బీజేపీని గెలిపించాలి -
కిషన్‌రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యే భేటీ..అందుకేనా..!
సాక్షి,హన్మకొండజిల్లా:తెలంగాణ రాజకీయల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కలిశారు. కిషన్‌రెడ్డి ఆదివారం(ఫిబ్రవరి16) హన్మకొండ పర్యటనకు వచ్చినపుడు ఎమ్మెల్యే ఆయనను కలిసి చర్చిచండంతో పాటు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించారు.వేయిస్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని,కుడా ఆధ్వర్యంలో చేపట్టే పనులకు అనుమతులు, నిధులు కేటాయించాలని కిషన్‌రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. ఎలాంటి రాజకీయ బేషమ్యాలకు పోకుండా హన్మకొండ అభివృద్దే తన ధ్యేయం అని ఎమ్మెల్యే చెప్పారు. అభివృద్ధి కోసమే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిశానని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో ఇది కొత్త ఒరవడిని సృష్టిస్తుందన్నారు. -
రేవంత్.. 50 మంది విద్యార్థులు చనిపోయినా చలనం లేదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపంగా మారిందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలు.. కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయన్నారు. ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదని ఘాటు విమర్శలు చేశారు.తెలంగాణలో గురుకులాల పరిస్థితిపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్ వేదికగా కేటీఆర్..‘ఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి. నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు.. నేడు సరైన దిశానిర్దేశం లేక దీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. నాడు గురుకులాల్లో సీటు కోసం పోటీ పడిన విద్యార్థులు.. నేడు గురుకులం పేరు చెబితే డీలా పడిపోతున్నారు. నాడు కడుపునిండా అన్నం తిని-అనుకున్న లక్ష్యాలను సాధిస్తే.. నేడు అన్నమో రామచంద్ర అనే రోజులొచ్చాయి. నాడు 41 వేల సీట్లకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాసేందుకు లక్ష 68 వేల దరఖాస్తులు వస్తే.. నేడు 51 వేల సీట్లకు గాను 80 వేల దరఖాస్తులే వచ్చాయి.ఏడాది పాలనలో 50 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణించినా కాంగ్రెస్ సర్కారులో కనీస చలనం లేదు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు కనీస పరామర్శ లేకపోగా అంత్యక్రియలకు, పరామర్శకు వెళ్లే ప్రతిపక్షం మీద ఈ ప్రభుత్వం నిర్భందం ప్రయోగిస్తోంది. ఈ సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ భవిష్యత్తు అయిన భావితరాలకు శాపం. జాగో తెలంగాణ జాగో!’ అంటూ కామెంట్స్ చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలోఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు ఎదిగిన గురుకులాలుఏడాది కాంగ్రెస్ పాలనలో అస్తవ్యస్తమై అధ్వాన్న స్థితికి చేరాయి.నాడు డాక్టర్లు, ఇంజనీర్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నేడు సరైన దిశానిర్దేశం లేకదీన పరిస్థితి ఎదుర్కొంటున్నారు.నాడు గురుకులాల్లో సీటు కోసం… pic.twitter.com/LLjDPGGcoz— KTR (@KTRBRS) February 16, 2025 -
బీజేపీ నేతలకు పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: పుట్టుకతో బండి సంజయ్ ఓబీసీ, పుట్టుకతో మోదీ బీసీ కాదని.. ఓబీసీ ముసుగులో మోదీ బీసీలకు చేసిందేమీ లేదంటూ టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. కుల గణన దేశ చరిత్రలో నిలిచిపోయే అంశం. రేవంత్ మాటలకు బీజేపీ నేతలు హైరానా పడుతున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.బీసీల మీద బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే జన గణనతో పాటు కుల గణన చేయాలి. కుల గణన రీ సర్వే పూర్తి అయ్యాక చట్టం చేస్తాం. 9వ షెడ్యూల్ చట్ట సవరణ చేసి దేశంలోని బీసీలకు కేంద్రంలో ఉన్న బీజేపీ మేలు చేయాలి. సీఎం రేవంత్.. మోదీ కులం గురించి తప్పుగా మాట్లాడలేదు.. అమిత్ షా కూడా దీనిని అంగీకరించారు. 24-7-1994న ఓసీ నుంచి ఓబీసీలలో చేర్చారు.గాంధీ కుటుంబం త్యాగాలు మర్చిపోయి బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం త్యాగం చేశారు?. రాహుల్ గాంధీ కులం దేశ ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ కులం అడుగుతున్న మీరు దేశంలో కుల గణన చేసి ఆయన ఇంటికి వెళ్లి అడగండి. సోనియా గాంధీ ఇటలీలో పుట్టిన కానీ భారతీయతను పుణికి పుచ్చుకుంది. ఇప్పటికే డిల్లీ స్కాం బయట పడింది. పింక్ బుక్ ఓపెన్ చేస్తే ఇంకా ఎన్ని స్కాంలు బయట పడతాయో తెలియదు. అందుకే పింక్ బుక్ ఓపెన్ చేయొద్దని కవితకు సూచనలు చేస్తున్నా’’ అంటూ మహేష్ గౌడ్ ఎద్దేవా చేశారు. -
ప్రధానిని అలా అనలేదు: సీఎం రేవంత్ క్లారిటీ
సాక్షి,న్యూఢిల్లీ:తాను ప్రధాని నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దుర్భాషలాడలేదని, పీఎం కుర్చీని అగౌరపర్చలేదని సీఎం రేవంత్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి ఢిల్లీలో శనివారం(ఫిబ్రవరి15) మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు. ‘పుట్టుకతోనే మోదీ బీసీ కాదు అని మాత్రమే చెప్పాను. నేను చెప్పిన తేదీల్లో తేడా ఉంటే ఉండొచ్చు.మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి.రాహుల్‌తో నాకు ఎలాంటి గ్యాప్ లేదు.గ్యాప్ అంతా ఊహాగానాలే. రాహుల్ గైడెన్స్‌తోనే పనిచేస్తున్నా. రాహుల్ ఎజెండాను సీఎంగా నెరవేర్చడమే నా పని. దేశంలో ఎవరూ చేయలేని విధంగా బీసీ కులగణన చేశా. మిస్ అయిన వారి కోసం మరోసారి కులగణన అవకాశమిస్తున్నాం’అని రేవంత్ తెలిపారు.కాగా,శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని కన్వర్టెడ్ బీసీ అని, పుట్టుకతో బీసీ కాదని అన్నారు.మోదీ మొదటిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారన్నారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగింది. -
టీ అమ్మితే తప్పేంటి?: లక్ష్మణ్
సాక్షి, కరీంనగర్ జిల్లా: ఒక పేదవాడు కుటుంబ ఆదాయం కోసం టీ అమ్మాడు తప్పేంటి? అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. మోదీ కులాన్ని, వేసుకునే బట్టలను, తినే తిండిని, రాహుల్ గాంధీ విమర్శించారంటూ ఆయన మండిపడ్డారు. కరీంనగర్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ, సబ్కా సాత్ సబ్ కా వికాస్ ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే అనేక సంక్షేమ పథకాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. 5 వేల 700 కోట్లు తెలంగాణాలో రైల్వే అభివృద్ధికి కేటాయించారు. చర్లపల్లిలో కొత్త టెర్మినల్ ను కట్టింది బీజేపీ కాదా?. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లను రిస్ట్రక్చర్ చేసిన ఘనత బీజేపీది కాదా?. మెదక్, సిద్ధిపేట, కొమురవెల్లికి రైల్వేస్టేషన్లు ఇచ్చింది మోదీ ప్రభుత్వమే’’ అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు.‘‘12 లక్షల 70 వేల మెట్రిక్ టన్నుల యూరియాను మోదీ ప్రభుత్వం ఉత్పత్తి చేస్తోంది. జహిరాబాద్‌లో ఇండస్ట్రియల్ కారిడర్‌ను తీర్చిదిద్దాం. 82 లక్షల మందికి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తున్నాం. తెలంగాణ భవిష్యత్ నిర్ధేశించే ఎన్నికలు కాబట్టి అందరూ అలోచించి ఓటు వేయాలి. మోస పూరితమైన రేవంత్ రెడ్డి మాటల తూటాలకు ప్రజలు మోసపోవద్దు’’ అంటూ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. -
బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర: కవిత
సాక్షి, ఖమ్మం జిల్లా: కేసీఆర్‌పై కక్షతో రైతులను బాధపెడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీసి రిజర్వేషన్ల సర్వే పూర్తి చేసి ఫిగర్స్ స్పష్టం చేయాలని.. బీసీ రిజర్వేషన్ల పేరుతో పెద్ద కుట్ర జరుగుతోందన్నారు. 46 శాతం ఉన్న బీసీలకు అదే స్థాయిలో విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఇవ్వాలన్న కవిత.. బీసీల విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ల కోసం ప్రత్యేక బిల్లులు పెట్టాలని డిమాండ్ చేశారు.మూడు బిల్లులు పెట్టకపోతే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేనట్టే. మీకు నిజాయితీ ఉంటే సిన్సియర్‌గా రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే మూడు బిల్లులు పెట్టండి. రేవంత్ రెడ్డి తనకు అవసరమైనప్పుడు బీజేపీ నేతలతో మాట్లాడిస్తుంటారు. ఖమ్మంకి ముగ్గురు మంత్రులు ఉన్నారు. నిజామాబాద్‌లో మంత్రే లేడు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టాం. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. -
రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ
న్యూఢిల్లీ, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో శనివారం భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిణామాలతో సహా పలు కీలకాంశాలపై రాహుల్‌తో సుమారు 45 నిమిషాలపాటు చర్చించారు. పీసీసీ నూతన కార్యవర్గం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశాలు.. తదితర అంశాలతో వీళ్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే.. కులగణన, ఎస్సీ వర్గీకరణ పూర్తి చేసిన నేపథ్యంలో వాటి గురించి రాహుల్‌కు సీఎం రేవంత్ వివరించినట్లు సమాచారం. తెలంగాణలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దానికి ముఖ్యఅతిథిగా రావాలని రాహుల్‌ను రేవంత్ కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఏఐసీసీ(AICC) అగ్రనేతలతో భారీ బహిరంగ సభలకు తెలంగాణ కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. పొలిటికల్ మైలేజ్ వచ్చేలా.. సూర్యాపేటలో బీసీ కులగణన, మెదక్‌లో ఎస్సీ వర్గీకరణ భారీ సభలు నిర్వహించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే.. రేవంత్ విషయంలో అధిష్టానం అసంతృప్తిగా ఉందని, ఈ కారణం చేతనే రాహుల్ గాంధీతో ఆయనకు గ్యాప్ నెలకొందనే ప్రచారం నడిచింది. అయితే.. అదంతా ఉత్త ప్రచారమేనని తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కొట్టిపారేయగా, తాజాగా రాహుల్‌తో భేటీ అనంతరం సీఎం రేవంత్ కూడా స్వయంగా ఖండించారు. -
రేవంత్.. రాహుల్ గాంధీ కులమేంటి?: బండి సంజయ్
సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్.. ప్రధాని గురించి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని హితవు పలికారు కేంద్రమంత్రి బండి సంజయ్. దేశ ప్రధాని ఎవరైనా ఆయనను బాధ్యతతో గౌరవించాలి. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి అని డిమాండ్ చేశారు.కేంద్రమంత్రి బండి సంజయ్ తాజాగా ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మన దేశ ప్రధానమంత్రిని ఎవరైనా గౌరవించాలి. రేవంత్ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. మోదీ కులాన్ని బీసీ జాబితాలోకి చేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. దేశంలో 27 మంది బీసీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా ప్రధాని మోదీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం 46 శాతం బీసీలు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎంత మంది బీసీలను మంత్రులుగా చేశారు?. అగ్రవర్ణాల్లో పేదలను మోదీ గుర్తించారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీది ఏ కులం, ఏ మతం అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. రాహుల్ కుటుంబం గురించి చర్చ జరగాలి. కొరివితో తల గోక్కోవడం అంటే ఇదే. రాహుల్ గాంధీ కులం, మతం, దేశం మీద.. మూడు ఎమ్మెల్సీ ఎన్నికలకు వెళ్దామా?. ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా డైవర్షన్ చేయడానికే ఈ చర్చ పెడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆరు గ్యారంటీలపై మాట్లాడటం లేదు. 317 జీవోపై మాట్లాడింది కేవలం బీజేపీ మాత్రమే. నిరుద్యోగ మార్చ్ చేసింది బీజేపీనే పార్టీనే. ఉద్యోగుల కోసం మేము పోరాటం చేశాం.పది శాతం ముస్లీంలను తీసివేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రానికి పంపితే మోదీని ఒప్పిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించిన స్థానాలలో ముస్లింలే గెలిచే ప్రమాదం ఉంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఘోరమైన తప్పిదాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. కుల గణన సక్రమంగా చేస్తే రీ సర్వే ఎందుకు చేస్తారు?. కాంగ్రెస్ కుల గణన తప్పుల తడకగా ఉందన్నారు.ఇదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ..‘వ్యక్తి కోసం పార్టీ రూల్స్ మారవు. పార్టీ అంతర్గతవిషయాల్లో కులాలు చూడరు. ఒక్క వ్యక్తిని ఉద్దేశించి పార్టీ నిర్ణయాలు మార్చుకోదు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి. ఇలా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. రాజా సింగ్ మా పార్టీ ఎమ్మెల్యే ఆయనతో రోజు మాట్లాడతాను’ అని అన్నారు. -
కేసులకు బెదిరే ప్రసక్తే లేదు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసింది లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ప్రజాక్షేతంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదని హితవు పలికారు. అలాగే, పరిపాలన చేయడం చేతగాక బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శనివారం ఖమ్మం జిల్లాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఖమ్మం జైలులో ఉన్న బీఆర్ఎస్ నేత లక్కినేని సురేందర్‌ను పరామర్శించారు. అనంతరం, కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సురేందర్ లాంటి వారిని అక్రమ కేసులు పెట్టీ జైలుకు పంపడం సరికాదు. తెలంగాణలో 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి వెలగపెట్టింది ఏమీ లేదు. మీ వైఫల్యాలను కచ్చితంగా ఎండగడతాం. ఒక్క సురేందర్‌కే కాదు.. రాష్ట్రంలో కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా అక్కడకు అంతా కలిసి వెళ్లి వారికి అండగా ఉంటాం. ప్రజా క్షేత్రంలో కక్షపూరిత రాజకీయాలు సరికాదు. లక్కినేని సురేందర్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు.కేసీఆర్‌ను కట్టడి చేయాలని చూస్తున్నారు. పార్టీకి చెందిన వారిని కొందరని అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ను అడ్డుకున్నట్టా?. రైతుబంధు రాలేదు.. రైతుబీమా రాలేదు, పెన్షన్ రాలేదు, ఉద్యోగాలు రాలేదు, అన్నీ దొంగ మాటలే. 14 నెలల పాలనలో దొంగ హామీలే తప్ప చేసిందేమీ లేదు. కాంగ్రెస్ పాలనపై ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. పాలించడం చేతకాక అక్రమ కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది లేదు. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. కేసులకు భయపడొద్దు, ప్రజా క్షేత్రంలో పోరాడుతూనే ఉందాం’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. -
మోదీపై వ్యాఖ్యల ఎఫెక్ట్.. రేవంత్ మతి తప్పిందా?: డీకే అరుణ ఫైర్
సాక్షి, మహబూబ్‌నగర్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ డీకే అరుణ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రేవంత్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని అనుకుంటున్నారు. ఇదే సమయంలో రేవంత్‌ను లక్కీ లాటరీ సీఎం అని అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.ప్రధాని మోదీపై సీఎం రేవంత్ వ్యాఖ్యల విషయంలో ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ క్రమంలో తాజాగా డీకే అరుణ మాట్లాడుతూ.. మిస్టర్ రేవంత్ రెడ్డినోరు జారితే ఊరుకోను. ప్రధాని మోదీ సామాజికవర్గం గురించి మాట్లాడే స్థాయి నీకు ఎక్కడిది. రేవంత్ రెడ్డికి మతి తప్పింది.. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి ఫస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారు. ప్రజల దృష్టిలో మరల్చడానికి ఇలాంటి చిల్లర కామెంట్స్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడడానికి సిగ్గు అనిపించడం లేదా?.నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే.. తెలంగాణలో రెండోసారి కులగణన ఎందుకు?. ముందు దీనికి సమాధానం చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టే రెండోసారి కులగణన చేయాల్సి వస్తోంది. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు, బీసీలు లేరు, మీకు ఓట్లేసిన కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు దింపేద్దామని ప్రజలే చూస్తున్నారు. ఇప్పటికైనా నీ స్థాయి ఏంటో తెలుసుకో రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావ్. ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నారని అనుకుంటున్నారా?. అందుకే ఆయన భాష, ప్రవర్తన అలానే ఉంది.. ఇంకా మార్చుకోలేదు. నీలాగా అధికారం ఉందనే గర్వంతో రెచ్చిపోయినవాళ్లు ఇప్పుడు ఎక్కడున్నారో గుర్తుంచుకోవాలి. మాట తీరు మార్చుకో.. ముఖ్యమంత్రి కుర్చీకి గౌరవం ఇవ్వండి.ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు ఇచ్చినా వీళ్ళకు ఇంకా అహంకారం తగ్గలేదు. మీకు దమ్ముంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయండి. మీరు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రధాని మోదీ దేశ ప్రతిష్టను నలుమూలల చాటుతుంటే ఆయనకు వస్తున్న ఆదరణ చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా మోదీని చూసి నేర్చుకోండి. పేదరికం నుంచి ప్రధాని వరకు ఆయన ఎలా పైకి వచ్చారో తెలుసుకోండి. రేవంత్.. నువ్వు ఈ స్థాయికి ఎలా వచ్చావో అందరికీ తెలుసు. నువ్వు లక్కీ లాటరీ సీఎం. కాంగ్రెస్ పార్టీకి దిక్కులేక నిన్ను సీఎం సీట్లో కూర్చోపెట్టింది. ఇవ్వన్నీ తెలుసుకోకుండా ప్రధాని మోదీ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. -
మోదీ పుట్టుకతో బీసీ కాదు
సాక్షి, హైదరాబాద్: ప్రదానమంత్రి మోదీ(PM Narendra Modi)ని ఉద్దేశించి రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ పుట్టుకతో బీసీ కాదని, ఆయన కులం గతంలో ఉన్నత వర్గాల్లో ఉండేదని, గుజరాత్‌కు సీఎం అయ్యాక ఆయన తన కులాన్ని బీసీల్లో కలిపి ఇత్తేసి పొత్తు కుదిరాడని అన్నారు. మోదీ సర్టిఫికెట్ మాత్రమే బీసీదని, మనస్తత్వం ఇందుకు వ్యతిరేకమని విమర్శించారు. తాను బీసీ ప్రధానిని కనుక ఇక ఎవరూ అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, ఆయన కుటుంబ సభ్యులపై కూడా సీఎం విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో జనాభా లెక్కలు చెప్పని కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు లేదని అన్నారు. మరోమారు నిర్వహిస్తున్న కులగణనలో అయినా వివరాలు ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులకు సామాజిక బహిష్కరణే శిక్ష అని పేర్కొన్నారు. ఈ మేరకు ఈ సమావేశంలో తీర్మానం చేస్తున్నామని, అందరూ ఆమోదించాలని కోరారు. శుక్రవారం గాందీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన కులగణన, ఎస్సీ వర్గీకరణపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో కులగణన చేసిన తీరును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీలను వర్గీకరించిన తీరును మంత్రి దామోదర రాజనర్సింహ.. మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. పారదర్శకంగా కులగణన: ‘దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రెండు సమస్యలకు పరిష్కారం చూపే దిశలో మేం ప్రయత్నిస్తుంటే ప్రత్యర్థి రాజకీయ పక్షాలు, ఆ పారీ్టల నేతలు ఆరోపణలతో, లేనిపోని అపోహలు సృష్టిస్తూ కుల గణన తప్పుల తడక అనే అభిప్రాయం కలిగించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. దేశ వ్యాప్తంగా కులగణన జరిగి బలహీన వర్గాల లెక్క తేల్చి వారి కోటా, వాటా వారికివ్వాలనేది రాహుల్‌గాంధీ ఆలోచన. ఆ దిశలోనే ముందుకెళ్లి తెలంగాణ ప్రజలకు రాహుల్ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు పారదర్శకంగా కులగణన చేశాం. గ్యాంబ్లర్స్కు కులగణన ఇష్టం లేదు.. కేసీఆర్ గతంలో కాకి లెక్కలతో సర్వే చేశాడు. చెట్ల మీద విస్తరాకులు కుట్టి ఇదే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నాడు. ఆయన చేసిన లెక్క సక్కదనమైనది అయితే, ఎస్సీల్లో 59 ఉప కులాలుంటే ఆయన సర్వేలో 82 కులాలు ఎలా వచ్చాయి? రాష్ట్రంలో అందరినీ లెక్కపెడుతున్నప్పుడు కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు వివరాలు ఎందుకు ఇవ్వలేదు? అలా వివరాలు ఇవ్వని కేసీఆర్‌కు తెలంగాణలో జీవించే హక్కు, మాట్లాడే హక్కు లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, పోచంపల్లి వాళ్ల లెక్కలు చెప్పలేదు. కుల గణన చేయడం ఆ గ్యాంబ్లర్స్కు ఇష్టం లేదు. ఎందుకంటే వీళ్ల లెక్క తెలిస్తే గత ప్రభుత్వంలో నాలుగు మంత్రి పదవులు ఎలా తీసుకున్నారని బీసీలు అడుగుతారని, కడుగుతారని, వంగబెట్టి దంచుతారని తెలుసు. వీరి జనాభాకు వార్డు మెంబర్ కంటే ఎక్కువ పదవులేవీ రావు. అందుకే ఈ లెక్క రాకూడదని కేసీఆర్ కుట్ర చేస్తున్నాడు. మనకు తెలియకుండానే ఆ కుట్రలో మనం భాగస్వాములవుతున్నాం. నేను సవాల్ చేస్తున్నా.. మేం చేసిన కులగణనలో ఒక్క తప్పులేదు..’అని ముఖ్యమంత్రి అన్నారు. ఐదు గ్రూపుల్లో ముస్లింలు కూడా ఉన్నారు ‘కొందరు కాంగ్రెస్‌కు నేనే ఆఖరు సీఎం అని అంటున్నారు. అయినా ఫర్వాలేదు. మా నాయకుడి మాట నిలబెట్టేందుకే ఈ కులగణన చేశాం. నాయకుడిచ్చిన మాటను నిలబెట్టడం మా «ధర్మమని, ఏ త్యాగానికైనా సిద్ధమయ్యే ముందుకెళ్లాం. అయినా దొంగ లెక్కలు ఇలా రాస్తారా? దొంగ లెక్కలు రాయాలనుకుంటే మా జనాభా 5 శాతం ఎందుకు చూపిస్తాం. 15–20 శాతం చూపిస్తాం కదా? కొందరు మైనారీ్టల లెక్కలెలా తీస్తారని అంటున్నారు. గతంలో బీసీల్లో ఐదు గ్రూపులున్నాయి. అందులో ముస్లింలు కూడా ఉన్నారు. అందుకే వారి లెక్క తీశాం..’అని రేవంత్ వివరణ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజీలో పెట్టేలా బీజేపీ కుట్ర ‘బీసీల లెక్కలు రాకూడదన్నదే మోదీ, కేడీల ప్రయత్నం. తెలంగాణలో మా ప్రభుత్వం అన్ని కులాల లెక్కలు తీసిందని, అదే పని దేశవ్యాప్తంగా ఎందుకు చేయరని పార్లమెంటులో మోదీని రాహుల్‌గాంధీ నిలదీశారు. అందుకే రాష్ట్ర బీజేపీ నేతలు కూడా దీన్ని తప్పుల తడక అనే ముద్ర వేసి కోల్డ్ స్టోరేజీలో పెట్టాలనుకుంటున్నారు. నిజంగా మోదీకి బీసీలపై ప్రేమ ఉంటే 2021 లోనే జనాభా లెక్కలు తీసి అందులో కులగణన చేసేవారు. రేపు చేయబోయే జనగణనలో అయినా బీసీ కులాల లెక్క తేల్చాలి. నిజంగా మేం చేసిన లెక్కలు తప్పయితే మోదీ దేశ వ్యాప్తంగా కులగణన చేయడం ద్వారా రాష్ట్రంలోని బీసీల లెక్కలు తేల్చాలి. ఇవిగో మోదీ లెక్కలు, ఇవిగో రాహుల్ లెక్కలు అని ప్రజల ముందు పెట్టాలి..’అని సీఎం అన్నారు. వారి ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పులు కొట్టండి ‘ఎస్సీలను వర్గీకరించి రిజర్వేషన్లు పంపిణీ చేశాం. దీన్ని కూడా తప్పు పట్టాలని కొందరు చూస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు దీన్ని చాలెంజ్ చేయండి. ఏ లెక్క, ఏ వార్డు, ఏ కుటుంబంలో తప్పు ఉందో చెప్పమని అడగండి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుల ఇళ్ల ముందు మేల్కొలుపు డప్పులు కొట్టండి. అప్పుడు కూడా వివరాలు ఇవ్వకపోతే సామాజిక బహిష్కరణ శిక్ష విధించండి..’అని సీఎం వ్యాఖ్యానించారు. సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సభ్యులు పొన్నం ప్రభాకర్, సీతక్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్
సాక్షి, ఢిల్లీ: తొమ్మిది రాష్ట్రాలకు ఇంఛార్జ్‌లను ఏఐసీసీ ప్రకటించింది. దీపాదాస్ మున్షీ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. 2009లో మధ్యప్రదేశ్ మాండసోర్ నుంచి ఎంపీగా మీనాక్షి నటరాజన్ పనిచేశారు.హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, జార్ఖండ్, మణిపూర్, బీహార్ రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లను ఏఐసీసీ నియమించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్‌లకు కొత్త జనరల్ సెకట్రరీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. -
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:పుట్టుకతో ప్రధాని మోదీ బీసీ కాదని,ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం(ఫిబ్రవరి14) గాంధీభవన్‌లో జరిగిన యూత్ కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు. సర్టిఫికెట్లలో మోదీ బీసీ కానీ మోదీ మనసంతా బీసి వ్యతిరేకి. మోదీ తొలిసారి సీఎం అయ్యాకే ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు. అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా. కేంద్రానికి సవాల్ చేస్తున్నా.. జనగణనతో పాటు కులగణన చెయ్యాలి. కేంద్రం లెక్కలు మా ప్రభుత్వం చేసిన లెక్కలను సరిపోల్చుదాం. కులగణన సర్వేలో పాల్గొనని కేసీఆర్,కేటీఆర్,హరీష్ లను బహిష్కరణ చెయ్యాలి.బహిష్కరణ కోసం మీ సమక్షంలో తీర్మానం చేస్తున్న. ప్రభుత్వ సర్వే తప్పుల తడక అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ చేసింది. భారత్ జోడో యాత్రలోనే రాహుల్ గాంధీ స్పష్టం గా కులగణన చేస్తాం అని హామీ ఇచ్చారు. దేశంలో ఉన్న అన్ని జాతులకు వారి ఫలాలు అందాలని రాహుల్ గాంధీ ఆకాంక్షించారు.డోర్ టు డోర్ వెళ్లిన సిబ్బంది ముందే డేటా ఎంట్రీ చేశాం. కేసీఆర్ సర్వే..కాకిలెక్కల సర్వే.తెలంగాణ సమాజంలో తిరిగే హక్కే కేసీఆర్, కేటీఆర్,సంతోష్ రావ్ లకు లేదు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు కేసీఆర్ ఇచ్చి ఉంటే మాట్లాడే హక్కు ఉండేది.కులగణన సర్వేలో డేటా ఇవ్వని లిస్టులో ముందు వరుసలో కేసీఆర్ కేటీఆర్,సంతోష్ రావ్ గ్యాంబ్లింగ్ శ్రీనివాస్‌లు ఉన్నారు.కేసీఆర్ లెక్క తేలితే..వార్డు మెంబర్ పదవి కూడా ఆ కుటుంబానికి రాదుగొప్పగొప్ప నేతలు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినవాళ్లే. చంద్రబాబు,కేసీఆర్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వారే. యూత్ కాంగ్రెస్ శక్తి ఏంటో మాకు తెలుసు. అనిల్‌యాదవ్,బల్మూరి వెంకట్ సేవలను గుర్తించి వారికి పదవులు ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 55వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం.డబ్బుతో రాజకీయాలు సాధ్యాం కాదు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో ఉన్నవారికే టికెట్లిస్తాం. ఢిల్లీ నుంచి కాదు గల్లీ నుంచి వారికే పదవులు వస్తాయి. పదేళ్లు కేసీఆర్ తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అని చెప్పి కేసీఆర్ అబద్ధాలు చెప్పాడు. లిక్కర్ కేసు ద్వారా కేసీఆర్, కేజ్రీవాల్‌ను ఓడగొట్టిన కవిత ఇప్పుడు మాట్లాడుతోంది. కేసీఆర్‌నే గట్టిగా ఓడగొట్టాం నువ్వొచ్చి చేసేదేముంది. కేసీఆర్ గట్టిగా కొడతా అంటున్నాడు. కొట్టాలనుకుంటే నీ కొడుకు కేటీఆర్‌ను పిచ్చిపిచ్చిగా కొట్టు. ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడగొట్టినందుకు నీ అల్లుడిని కొట్టు. డబ్బుతో గెలవాలనుకుంటే కేసీఆరే గెలిచేవాడు. కేసీఆర్,కేటీఆర్, కవిత దగ్గర వేల కోట్లున్నాయిప్రభుత్వ పథకాలను యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.ప్రజలకు అండగా ఉన్నవారికి మాత్రమే పదవులు ఇస్తాం.సామాన్యులకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కష్టపడి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాం. డబ్బుతో ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు. -
సెక్రటేరియట్లో పెచ్చులు.. మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్‌లోసీఎం చాంబర్ పక్కన పెచ్చులు ఊడిన ఘటనపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఈ విషయమై శుక్రవారం(ఫిబ్రవరి14) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రెయిలింగ్ ఊడిన ఘటనపై విచారణ చేయాలని ఆర్అండ్బీ ప్రిన్సిపల్ సెక్రెటరీని ఆదేశించినట్లు తెలిపారు.విచారణ నివేదిక వచ్చాక అసలు విషయం ఏంటనేది తెలియజేస్తాం.ప్రభుత్వానికి రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) లాంటి ప్రధానమైన పనులు చాలా ఉన్నాయి.పెచ్చులు ఊడటం చిన్న విషయం..ఆ అంశాన్ని అధికారులు చూసుకుంటారు’అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.కాగా, ఇటీవల తెలంగాణ సచివాలయంలో పీవోపీ పార్టిషన్ స్వల్పంగా కూలింది. పెచ్చులు ఊడిపడ్డాయి. సీఎం ఛాంబర్ అంతస్తులో పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడి కింద ఉన్న రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. కారులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పెచ్చులు ఊడిపడడంతో ఉద్యోగులు ఆందోళన చెందారు.పీఓపీ పెచ్చులు ఊడి పడటంతో అధికారులు, భదత్రా సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయం పీఓపీ కూలడం చర్చనీయాంశంగా మారింది. సచివాలయ నిర్మాణ లోపాలపై చర్చ జరుగుతోంది. -
నేను బీజేపీకి అవసరం లేదనుకుంటా?: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో, బీజేపీలో అంతర్గత విభేదాలు చర్చనీయాంశంగా మారింది.తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియోలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజాసింగ్.. పార్టీలో వేధింపులు భరించలేకపోతున్నాను. దీని కంటే బయటికి వెళ్లడమే కరెక్ట్ అనుకుంటా. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ వ్యక్తికి ఇవ్వాలని నేను సూచించాను. నేను చెప్పిన పేరు కాకుండా వేరే పేరు ఇవ్వడం ఏంటి?. కానీ, ఎంఐఎం పార్టీతో తిరిగే నాయకుడికి ఇచ్చారు. పార్టీకి నా అవసరం లేదనుకుంటా?. ముందు ముందు ఏమవుతుందో చూద్దాం. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సింది. కానీ, ఇలాంటి రిటైరైన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఇక్కడ ఎప్పటికీ అధికారంలోకి రాదు. పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారు. తన సూచనను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఇక, ఇదే సమయంలో.. ఈ విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారు. దీనిని బట్టి చూస్తే పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని అర్థం అవుతుందంటూ రాజాసింగ్ వివరించారు. తాను ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంతో యుద్ధం చేస్తూ వచ్చానని, కానీ, సొంత పార్టీలోనూ యుద్ధం చేయాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి తాను అవసరం లేదని, వెళ్లిపోవాలని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
TG: అర్ధరాత్రి హైడ్రామా.. బీఆర్ఎస్ నాయకుడు అరెస్ట్
సాక్షి, చండూరు: నల్లగొండ జిల్లాలో మరోసారి రాజకీయం హీటెక్కింది. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ అన్నెపర్తి శేఖర్‌ను పోలీసులు అరెస్టుచేశారు. రాత్రి రెండు సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. శేఖర్‌ను తీసుకెళ్లడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు చెందుతున్నారు. మరోవైపు.. శేఖర్ అరెస్టుపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక పోలీసులు చెప్పడం గమనార్హం.వివరాల ప్రకారం.. జిల్లాలోని చండూరులో బీఆర్ఎస్ నాయకుడు అన్నెపర్తి శేఖర్‌ను గురువారం అర్ధరాత్రి దాటిన కొందరు వ్యక్తులు ఆయనను అదుపులోకి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా కుటుంబీకులను భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో, ఆయనను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎందుకు అరెస్టు చేశారనే విషయాలు చెప్పకుండానే లాకెళ్లారు. ఈ క్రమంలో అన్నెపర్తి శేఖర్ సతీమణి.. ఎవరు మీరని ప్రశ్నించినప్పటికీ వారు సమాధానం ఇవ్వలేదు. తన భర్తను కారులోకి ఎక్కించిన తర్వాత చివరకు పోలీసులమని చెప్పారని కుటుంబ సభ్యులు వెల్లడించారు.అయితే, శుక్రవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన లేకపోవడంతో ఎక్కడికి తీసుకెళ్లారంటూ ప్రశ్నించారు. శేఖర్ ఆచూకీ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, అన్నెపర్తి శేఖర్ అరెస్టుపై ఎట్టకేలకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఓ వ్యక్తిని చీటింగ్ చేయడం, బాధితుడిపై దాడి ఘటనలో అరెస్ట్ చేశామని చండూరు పోలీసులు వెల్లడించారు. బాధితుడి పిర్యాదు మేరకు నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశామన్నారు.మరోవైపు.. శేఖర్ అరెస్ట్‌పై మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం, మునుగోడు ఎస్పీ కార్యాలయం వద్ద ఆయన మాట్లాడుతూ..‘అన్నెపర్తి శేఖర్ అరెస్ట్ అప్రజాస్వామికం. అర్థరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది?. ప్రభుత్వాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించడంతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు నమోదు చేశారు. బెదిరించడంలో భాగంగా ఓ కేసును అడ్డం పెట్టుకుని కేసు నమోదు చేశారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదు. శేఖర్‌ను వెంటనే విడుదల చేయాలి. ఇంతవరకు శేఖర్‌ను అరెస్ట్ చేసి ఎక్కడ ఉంచారో కూడా సమాచారం లేదు అంటూ కామెంట్స్ చేశారు. -
19న తెలంగాణ భవన్‌కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KCR) సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల 19న పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్(Telangana Bhavan)కు రానున్నారు. పార్టీ ఆవిర్భవించి ఈ ఏడాది ఏప్రిల్‌కు 25 ఏళ్లు కానుంది. ఈ నేపథ్యంలో పార్టీ రజతోత్సవాల నిర్వహణతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నెల 19న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమయ్యే ఈ భేటీకి పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో పాటు జిల్లా అధ్యక్షులు, తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, మాజీ జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలకు పార్టీ తరఫున ఆహ్వానం పంపించారు. కేసీఆర్ అధ్యక్షత న జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నిర్మాణానికి సంబంధించి దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. బహిరంగ సభ వేదిక ఖరారు చేసే అవకాశంరాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ అనుసరించాల్సిన కార్యాచ రణపైనా ఈ భేటీలో సమగ్రంగా చర్చిస్తారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి పెంచడంతో పాటు ప్రజల హక్కులను కాపాడే దిశగా పార్టీ పరంగా నాయకులు, కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేస్తారు. ఈ నెలాఖరులో బీఆర్ఎస్ సత్తా చాటేలా భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో సభా వేదికను కూడా 19న జరిగే భేటీలో ఖరారు చేసే అవకాశముంది. ఆహ్వానితులు కచ్చితంగా హాజరు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.ఆరు నెలల తర్వాత..సుమారు ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్‌కు వస్తున్న పార్టీ అధినేత కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత ఏడాది జూలై 23న తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్ నేతలతో భేటీలో ప్రభుత్వ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు వంటి అంశాలను ప్రస్తావిస్తూ నేతలను తయారు చేసుకోవడం బీఆర్ఎస్కు కొత్త కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికే పరిమితం అయ్యారు. అక్కడే పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అవుతూ పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. -
ఆర్ఆర్ఆర్కి నిధుల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను వచ్చేనెల ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలను చేపట్టారు. గురువారం సచివాలయంలో ఆయా శాఖలకు కేటాయింపులకు సంబంధించి రహదారు లు – భవనాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారు లతో సమావేశమయ్యారు, ఆర్‌అండ్‌బీకి సంబంధించి ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భట్టి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 3డి డిజైన్లు వంటి పనులను సత్వరం పూర్తిచేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశా రు.ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని భట్టి అధికారులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు.కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, డిప్యూటీ సీ ఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.హాస్టళ్ల, గురుకులాల బకాయిలు చెల్లిస్తాం..అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్ల, గురుకులాల అద్దె బకాయిలు వెంటనే చెల్లిస్తామని అందుకు, ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు. బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని భట్టి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు.డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని ఆదేశించారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు, నిర్వహణ, ఆదాయ వనరులపై మంత్రులు అధికారులను అడిగారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఖజానా ఖాళీ.. తలలు పట్టుకుంటున్న సీఎం,డిప్యూటీ సీఎం
సాక్షి,హైదరాబాద్ : కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. ఇప్పుడు నిధులు సర్దుబాటు చేయలేక సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తలలు పట్టుకుంటున్నారని’ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి కోతల రాయుళ్లు.ఐటీఐఆర్ తీసుకొచ్చి బీజేపీ నేతలు మాట్లాడాలి. నేనేంటో,నా పనితనం ఏంటో రాష్ట్ర నేతలకు, ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేతలకు తెలుసు. నా అవసరం అనుకుంటే జగ్గారెడ్డికి పదవి ఇస్తారు. జగ్గారెడ్డి పదవి ఉన్నా ..లేకున్నా పార్టీ కోసం పనిచేస్తూనే ఉంటాడు.బీజేపీ నేతలు సీఎం రేవంత్‌ను రెచ్చగొట్టి తిట్టించుకుంటారు. ఎన్నికలకు చాలా సమయం ఉంది.. పింక్ బుక్ అంటూ రెచ్చగొట్టకు కవిత. కేసీఆర్ ఖజానా ఖాళీ చేశారు. నిధులు సర్దుబాటు చేయలేక మా సీఎం, డిప్యూటీ సీఎం తలలు పట్టుకుంటుంన్నారు.వరంగల్‌కు రావాలంటే రాహుల్ గాంధీ భయపడతారా?..రాహుల్ గాంధీ ఓంట్లోనే భయం లేదు.. కన్యాకుమారి టూ కాశ్మీర్ పాదయాత్ర చేశారు. కేసీఆర్ కనీసం పది కిలోమీటర్లు పాదయాత్ర చేయగలరా? ఐటీఐఆర్ కోసం అవసరం అయితే కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ను కలుస్తా. ఐటీఐఆర్ ద్వారా వేల ఉధ్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వస్తాయి’ అని అన్నారు. -
‘అప్పుల కుప్పగా తెలంగాణ’.. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (nirmala sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం .. ఇప్పుడు అప్పుల కుప్పగా మార్చారు’అని రాజ్యసభలో బడ్జెట్‌పై (parliament budget session) చర్చ సందర్భంగా మాట్లాడారు. నిర్మల సీతారామన్ ఇంకా ఏమన్నారంటే? ‘ఏపీ విభజన సమయంలో తెలంగాణ (telangana debt) మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. కానీ ఇప్పుడు అది అప్పుల కుప్పగా తయారైంది. నేను ఏ పార్టీని తప్పుబట్టడం లేదు. ఇందిరాగాంధీ గెలిచిన మెదక్ నియోజకవర్గంలో తొలుత రైల్వే స్టేషన్‌ను మోదీ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించింది మోదీ ప్రభుత్వమే.ఎరువుల ఉత్పత్తిలో రికార్డు స్థాయిలో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచాం. నిజామాబాదులో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ఘనత ప్రధానిదే. అత్యద్భుతమైన పసుపు పండే ప్రాంతం నిజామాబాద్. తెలంగాణకు చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం జహీరాబాద్‌లో పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్ట్స్ టైల్ పార్కు, సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం, బీబీనగర్‌లో ఎయిమ్స్, 2605 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం, భారత్ మాల కింద నాలుగు గ్రీన్ కారిడార్లు, రైల్వేల అభివృద్ధి కోసం తెలంగాణకు రూ.5337 కోట్ల బడ్జెట్ కేటాయింపు, ఏరుపాలెం నంబూరు మధ్య , మల్కాన్ గిరి పాండురంగాపురం మధ్య 753 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే ట్రాక్ నిర్మాణం,ఐదు కొత్త వందేభారత్ ట్రైన్ల కేటాయింపు, 40రైల్వే స్టేషన్స్ రీడెవలప్, పీఎం ఆవాస్ అర్బన్ కింద రెండు లక్షల ఇళ్ల నిర్మాణం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 31 లక్షల టాయిలెట్ల నిర్మాణం, జల్‌జీవన్ మిషన్ కింద 38 లక్షల నల్ల కనెక్షన్లు, 82 లక్షల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డుల మంజూరు, 199 జనఔషది కేంద్రాలను ఏర్పాటు..ఇలా చెప్పుకుంటూ పోతే అనే అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాము’ అని వ్యాఖ్యానించారు. 👉చదవండి : కమల్ హాసన్‌తో డీసీఎం భేటీ! -
ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గద్దె దించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీలోనే కుట్ర జరుగుతోందని ఆరోపించారాయన. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘అధికార పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారు. వాళ్లంతా సీఎం రేవంత్‌ను గద్దె దించేందుకు ఒక్కటయ్యారు. రేవంత్ పదవికి సొంత ఎమ్మెల్యేలతోనే ముప్పు పొంచి ఉంది’’ అని అన్నారాయన. అలాగే.. ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు.తెలంగాణ భవన్‌కు కేసీఆర్బీఆర్ఎస్ అధినేత ఎట్టకేలకు తెలంగాణ భవన్‌కు రానున్నారు. ఈ నెల 19వ తేదీన ఆయన అధ్యక్షతన బీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో పార్టీ సిల్వర్‌జూబ్లీ వేడుకల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. -
‘కాంగ్రెస్ పాలనపై గ్రామస్థాయి నుండి వ్యతిరేకత’
హనుమకొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత వస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనచారి. ఎన్నికల ముందు అధికారం కోసం 420 హామీలు ఇచ్చి, ఇప్పటివరకూ ఏ ఒక్క హానమీ నెరవేర్చలేనది మధుసూదనచారి ఆరోపించారు. హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ఏడాది పాలనా వైఫల్యం పేరుతో బీఆర్ఎస్ కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ క్యాలెండర్, డైరీని ఎమ్మెల్సీ మధుసూదనచారి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మధుసూదనచారి మాట్లాడుతూ.. ‘కడియం శ్రీహరి తన స్వార్థ రాజకీయాల కోసం పార్టీ మారాడు. పార్టీ మారిన ఎమ్మెల్యే లతో రాజీనామా చేయించి పోటీలో నిలబెట్టు. బీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యమంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చాం. పూర్తి స్థాయిలో కులగణ చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి. BRSసాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన మహనీయుడు కేసీఆర్. నూటికి నూరు శాతం బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే రేవంత్‌రెడ్డి పబ్బం గడుస్తదో అక్కడికి వెళతాడు’ అని విమర్శించారు మధుసూదనచారి. -
పింక్ బుక్‌లో రాస్తున్నాం.. ఇంతకింత చెల్లిస్తాం.: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జనగామ జిల్లా: పింక్ బుక్‌లో అన్ని రాసుకుంటున్నాం.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంతకింత చెల్లిస్తామంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. లెక్కలు ఎలా రాయాలో మాకూ తెలుసు.. మీ లెక్కలు తీస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.రైతు డిక్లరేషన్ పై నిలదీస్తారని రాహుల్ గాంధీ వరంగల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో చిన్న విమర్శ చేసినా సీఎం రేవంత్ భయపడుతున్నారు. పోస్టు చేసిన మరుసటి నాడే ఇంటికి పోలీసులు వచ్చి వేధిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ తిరుగుతారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మాత్రం రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసం’’ అని కవిత దుయ్యబట్టారు.‘‘కేసీఆర్ హయాంలో గ్రామాల్లో నీళ్లు పారాయి నిధులు పారాయి. కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి భయపడి 2001లో ఆగమేఘాలపై దేవాదుల ప్రాజెక్టుకు చంద్రబాబు శంకుస్థానప చేశారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ దేవాదుల ప్రాజెక్టు పనులను చేయించారు. 95 పూర్తయిన సమ్మక్క, సారక్క బ్యారేజీ పనులను పూర్తి చేయలేని చేతగాని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం 5 శాతం పనులను పూర్తి చేయలేని అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వానిది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?’’ అని కవిత నిలదీశారు.అవకాశవాదం కోసం కడియం శ్రీహరి పార్టీ మారారు. కడియం శ్రీహరిని ప్రజలు క్షమించే ప్రసక్తే లేదు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. న్యాయ వ్యవస్థపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్కు అనుకూలమైన తీర్పు వస్తుందన్న నమ్మకముంది. ఉప ఎన్నిక వస్తే అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుంది. రూ. 2500 ఇవ్వకుండా, స్కూటీలు ఇవ్వకుండా ప్రభుత్వం మహిళలను వేధిస్తోంది. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్లు మాయమయ్యాయి.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాల్సిందే. ఆడ బిడ్డలను మోసం చేసిన మహమ్మారి కాంగ్రెస్ ప్రభుత్వం. విదేశీ విద్యా స్కాలర్ షిప్ నిధులు కూడా విడుదల చేయని దౌర్భాగ్య పరిస్థితి. ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. రైతు భరోసా పేరిట రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు.రుణమాఫీ అందరికీ కాలేదు.. కానీ పూర్తయిందని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం... సంక్రాంతి నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పి ఇంకా ఇవ్వలేదు. కాంగ్రెస్ అబద్దాలను ప్రజల్లో ఎండగడతాం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది’’ అని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు.