సావు డప్పు మోగలే..!
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని అశోక్‌నగర్ కాలనీకి చెందిన సావిత్రమ్మ(70) మంగళవారం ఉదయం గుండెనొప్పితో మరణించింది. సమగ్ర సర్వే కారణంగా వాహనాలు తిరగకపోవడంతో మృతదేహాన్ని స్ట్రెచర్‌పై ఉంచి గంటన్నరకుపైగా రోడ్డుపైనే నిరీక్షించారు. అనంతరం ఓ స్నేహితుడి ట్రాక్టర్ తెప్పించి మృతదేహాన్ని తీసుకెళ్లారు. అందరూ సర్వేలో బిజీగా ఉండి రాకపోవడంతో అంత్యక్రియలను బుధవారానికి వాయిదా వేసుకున్నారు. ఇదే జిల్లా ఆర్మూర్ పెద్దబజార్‌లోని జెండాగల్లికి చెందిన చౌదరి లక్ష్మీబాయి (80) సోమవారం రాత్రి మరణించారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేసుకున్నారు.
సర్వే కారణంగా తాము రాలేమని డప్పు వాయించేవాళ్లు చెప్పడంతో ఫ్రీజర్ తెప్పించి మృతదేహాన్ని భద్రపరిచారు. అలాగే, భిక్కనూరుకు చెందిన బోయిని శివ్వయ్య (55), కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన అరికె లక్ష్మయ్య(85), కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం పంచాయతీ పరిధిలోని ఊశన్నపల్లెకి చెందిన మహేందర్(35), ఇదే మండలం కోనాపూర్‌కు చెందిన కోలపాక లక్ష్మీరాజం (65) మరణించారు. సర్వే నేపథ్యంలో బంధువులెవరూ రాకపోవడంతో వీరి అంత్యక్రియలను బుధవారానికి వాయిదా వేశారు.