సాక్షి, కరీంనగర్ : ముందస్తు ఎన్నికలకు స్పష్టమైన కారణాలు చెప్పకపోవడం కేసీఆర్ అభద్రతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ముందస్తు ఎన్నికలతో పాలన, అభివృద్ది కుంటుపడుతోందని, సామాన్య ప్రజలకు పాలన అందుబాటులో లేకుండా పోవడానికి కేసీఆర్ బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ నెల 10 కరీంనగర్‌లో అమిత్ షాతో నిర్వహించే బీజేపీ సమరభేరీ సభ జరుగునున్న నేపథ్యంలో ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కాంపీటేటీవ్ పరీక్షల్లో తప్పులతడకగా ప్రశ్నలు వస్తున్నాయని కేసీఆర్ వైఫల్యానికి ఇదే నిదర్శమని మండిపడ్డారు.
మహాకూటమి తెలంగాణ ద్రోహుల కూటమిగా మారిందన్నారు. రెండు కళ్ళ సిద్దాంతం గల చంద్రబాబు.. వేల మంది ఆత్మబలిదానాలకు కారణం అయ్యారని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి అమరావతికి పరిమితమైన చంద్రబాబు దొడ్డిదారిన తెలంగాణలో అడుగుపెట్టాలని ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ద్రోహులతో దోస్తీ కడుతున్న కోదండరాం తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment