రేపు కరీంనగర్ జిల్లాకు చంద్రబాబు
హైదరాబాద్: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. చంద్రబాబు పర్యటన వివరాలను టీడీపీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రేపు ఉదయం 8 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బస్సులో కరీంనగర్ కు చంద్రబాబు బయల్దేరతారు.
మధ్యాహ్నం 12 గంటలకు ఎల్గనూరులో పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నియోజకవర్గాల వారీగా టీడీపీ నాయకులతో చంద్రబాబు భేటీ అవుతారు.