సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 17న జిల్లా కేంద్రం సంగారెడ్డిలో నిర్వహించిన ర్యాలీలో జగ్గారెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను దూషించడంతో పాటు, నిబంధనలకు విరుద్ధంగా పలు వాగ్దానాలు చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను కొందరు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఫిర్యాదును పరిశీలించిన సంగారెడ్డి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న ఆర్డీఓ శ్రీను నోటీసు జారీ చేశారు. ‘నాకు ఊచ లు చూపించిన కేసీఆర్.. నీకు చుక్క లు చూపిస్తా’అంటూ జగ్గారెడ్డి వ్యా ఖ్యానించినట్లు ఫిర్యాదులో పేర్కొ న్నారు. నియోజకవర్గంలో 40 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని, కార్యకర్తలకు ఆర్థిక సాయం చేసేందుకు ప్రత్యేక బ్యాంకును ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి వాగ్దానం చేయడం నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ కార్యకర్తల నుంచి అందిన ఫిర్యాదును పరిశీలించిన తర్వాత నోటీసు జారీ చేసినట్లు సంగారెడ్డి ఆర్డీఓ శ్రీను ‘సాక్షి’కి వెల్లడిం చారు. జగ్గారెడ్డి ఇచ్చే సమాధానాన్ని బట్టి ఎన్నికల సంఘం నియమాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
జగ్గారెడ్డికి ఈసీ నోటీసులు
Published Tue, Oct 23 2018 3:20 AM | Last Updated on Tue, Oct 23 2018 3:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment