ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య | family of six ends Life in khammam district | Sakshi
Sakshi News home page

ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య

Published Wed, Jul 26 2017 8:02 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య

ఒకే కుటుంబంలో ఆరుగురు ఆత్మహత్య

కూసుమంచి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో విషాదం చోటుచేసుకుంది. పాలేరు జలాశయానికి అనుసంధానంగా ఉన్న జలవిద్యుత్‌ కేంద్రం కాలువలో దూకి ఆరుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. జీళ్ల చెరువు గ్రామానికి చెందిన షేక్‌ పెంటూ సాహెబ్‌(50), షేక్‌ మహబూబ్‌బీ(45), వీరి కుమారుడు షేక్‌ సలీం(32), సలీం భార్య రజియా(28), వీరి పిల్లలు షహనాజ్‌ బేగం(8) నస్రీనా (4) బుధవారం తెల్లవారుజామున కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరితో పాటు ఆత్మహత్య చేసుకుందామని వచ్చిన షేక్‌ లాలూ భయపడి ఆ ఆలోచన విరమించుకుని గ్రామానికి వెళ్లి విషయం చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పాలేరు జలాశయం మత్స్యకారులు మృతదేహాలను నీటిలో నుంచి వెలికి తీశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రఘు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత‍్మహత‍్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కుటుంబం మొత‍్తం ఆత‍్మహత‍్యకు పాల‍్పడడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement