నల్గొండ: నల్గొండ పట్టణం బస్టాండ్ సమీపంలోని ట్రాన్స్కో ఎస్ఈ కార్యాలయంలోని స్టోరు రూంలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. అయితే ట్రాన్స్కో సిబ్బంది వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
అయితే ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది రావడం చాలా అలస్యం కావడంతో స్టోరు రూంలోని మీటర్లు అన్ని కాలిపోయాయి. దీంతో విద్యుత్ శాఖకు రూ. లక్షల్లో నష్టం వాటిల్లింది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్ఈ... కార్యాలయానికి చేరుకుని అగ్నిప్రమాదానిక గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.