రేపటి నుంచి తొలి విడత నామినేషన్లు | First installment from tomorrow is nominations | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి తొలి విడత నామినేషన్లు

Published Sun, Jan 6 2019 12:49 AM | Last Updated on Sun, Jan 6 2019 12:49 AM

First installment from tomorrow is nominations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. మొదటి విడతలో 4,480 గ్రామ పంచాయతీలు, 39,832 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు రిటర్నింగ్‌ అధికారులు సోమవారం ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నారు. ఆ వెంటనే తొలి విడత నామినేషన్ల అంకం ప్రారంభం కానుంది. తర్వాత రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఈ నెల 9 వరకు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 10న సాయంత్రం 5 వరకు నామినేషన్ల పరి శీలన ముగించి ఆ తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాలను ప్రకటిం చనున్నారు. 11న సాయంత్రం 5 వరకు నామినేషన్లపై అప్పీళ్లను స్వీకరించి, 12న వాటిని పరిష్కరించనున్నారు.

నామినేషన్ల ఉపసంహరణ గడువు 13న మధ్యాహ్నం 3 గంటలకు ముగి యనుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన తుది అభ్యర్థుల జాబితాలను రిటర్నింగ్‌ అధికారులు ప్రకటిస్తా రు. 21న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు తొలి విడత పోలింగ్‌ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి అప్పటికప్పుడు ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత అదే రోజు ఉపసర్పంచ్‌ ఎన్నికలు జరపనున్నా రు. తొలి విడతలో 39 రెవెన్యూ డివి జన్లు, 197 మండలాల పరిధిలో పం చాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 

వారందరికీ ఓటు..  జనవరి 1 నాటికి ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసే అవకాశం లభించనుంది. జనవరి 1న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినందున, ఆ తేదీ నాటికి ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని తుది ఓటర్ల జాబితాలను తయారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచిం చింది. 7న తుది ఓటర్ల జాబితా ప్రకటించనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement