కుటుంబంలో చిచ్చుపెట్టిన ‘ఇందిరమ్మ’ బిల్లు | In the family conflict due indiramma house | Sakshi
Sakshi News home page

కుటుంబంలో చిచ్చుపెట్టిన ‘ఇందిరమ్మ’ బిల్లు

Published Sat, May 10 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM

In the family conflict due indiramma house

 దమ్మన్నపేట(వర్ధన్నపేట రూరల్), న్యూస్‌లైన్ : ఓ వృద్ధుడి పేర మంజూరైన ఇందిరమ్మ ఇంటి బిల్లు అతడి కొడుకుల మధ్య చిచ్చుపెట్టింది. చిన్న కొడుకు బిల్లు తీసుకున్నాడంటూ పెద్ద కొడుకు తండ్రిని ఇంట్లోకి రానివ్వని సంఘటన మండలంలోని దమ్మన్నపేటలో శుక్రవారం జరిగింది. వివరాలిలా ఉన్నారుు. గ్రామానికి చెందిన న్యాళం కొమురయ్య(70)కు మొగిళి, ఎల్లగౌడ్, సదయ్యగౌడ్ ముగ్గురు కొడు కులున్నారు. వారు వ్యవసాయం చేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. కొమురయ్య భార్య లచ్చమ్మ పదేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి ఆయన నెల రోజు లకు ఒకరి చొప్పున కొడుకుల వద్ద ఉంటున్నా డు. ఎక్కువ కాలం చిన్నకుమారుడు సదయ్య వద్ద ఉండడంతో అతడి రేషన్‌కార్డులో కొమురయ్య పేరు నమోదైంది. తండ్రి పేరిట మంజూరైన ఇందిరమ్మ పథకం కింద సదయ్య ఇల్లు కట్టు కున్నాడు.

ఈ విషయమై అన్నదమ్ముల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించిన డబ్బులను తమకు ఇస్తేనే తిండి పెడుతామని కొమురయ్యతో మొగిళి, ఎల్లగౌడ్  తేల్చిచెప్పారు. నెలరోజులు చిన్న కొడుకు సదయ్య వద్దనే ఉన్న కొమురయ్య ఇటీవల పెద్ద కొడుకు వద్దకు వెళ్లగా పట్టించుకోలేదు. దీంతో ఆయన గ్రామంలోని పెద్దమనుషుల వద్ద తన గోడు ను వెల్లబోసుకున్నాడు. తండ్రి బాధ్యతను ముగ్గురు కొడు కులు సమానంగా చూసుకోవాలని వారు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో మనోవేదనకు గురైన కొమురయ్య గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆందోళనకు దిగాడు. కొడుకులకు ఎంత సర్ధిచెప్పినా తనను పట్టించుకోవడం లేద ని, తనకు న్యాయం చేయాలని అక్కడికి వచ్చిన వారిని వేడుకోవడం అందరిని కలచివేసింది. చివరికి రెండో కుమారుడు ఎల్లగౌడ్ తండ్రిని తనవెంట తీసుకెళ్లాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement