ప్రతిపాదనలు కాగితాల్లోనే..!
గద్వాల:
ఏడాదిక్రితం ప్రారంభమైన గద్వాల రైల్వేజంక్షన్ ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోవడంలేదు. ఇక్కడ ఏర్పాటుచేయదలిచిన శిక్షణాసంస్థలు, రైల్వేసిబ్బంది క్యాంటీన్ నేతల ప్రతిపాదనలకే పరిమితమైంది. ఏడాది క్రితం అక్టోబర్ 12న గద్వాల రైల్వేజంక్షన్‌ను ప్రారంభించిన నేతలు ప్రతిపాదిత పనులను పూర్తిచేసే ప్రయత్నమే మానేశారు. వివరాల్లోకెళ్తే.. గద్వాల సంస్థానాధీశులు భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని 105 ఎకరాల స్థలాన్ని రైల్వేస్టేషన్‌తో పాటు జంక్షన్ అభివృద్ధికి కేటాయించారు.
కాగా, గద్వాలను రైల్వేజంక్షన్ గా మారుస్తూ కర్ణాటకలోని రాయిచూర్ నుంచి గద్వాల మీదుగా వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, దేవరకొండల మీదుగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా మాచర్ల వరకు రైల్వేలైన్‌ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్, ప్రతిపాదన ఉంది. మొత్తం రైల్వేలైన్ ఒకేసారి నిర్మించడం సాధ్యం కాదన్న ఉద్ధేశంతో 2002లో గద్వాల- రాయిచూర్ పట్టణాల మధ్య 59 కి.మీ మేర బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. రెండోదశలో గద్వాల నుంచి మాచర్ల వరకు లైన్ నిర్మించాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి.
మొదటిదశ పనులు పూర్తవడంతో ఏడాది క్రితం గద్వాల రైల్వేస్టేషన్‌ను జంక్షన్‌గా ప్రారంభించారు. కాగా, గద్వాల రైల్వేకోసం కే టాయించిన స్థలంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రైల్వేస్టేషన్, రైల్వేలైన్లు, సిబ్బంది క్వార్టర్లు నిర్మించారు. మిగతా 80 ఎకరాల్లో రైల్వేశిక్షణా సంస్థలతోపాటు, గద్వాలలో రైళ్ల హాల్టింగ్‌లు, సిబ్బంది మార్పు కొరకు సిబ్బంది క్యాంటీన్(కృ) నిర్మాంచాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కూడా కాగితాలకే పరిమితమైంది.
రైల్వే శిక్షణ సంస్థలతో ఉపాధి
గద్వాల రైల్వేజంక్షన్‌లో ఉన్న 80 ఎకరాల స్థలంలో రైల్వే శిక్షణా సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. దీంతోపాటు సాంకేతిక నిపుణులను వివిధ ప్రాంతాల నుంచి ఎంపికచేసిన తెలంగాణ నుంచి కూడా చాలామంది యువకులకు అవకాశాలు వస్తాయి.
గద్వాలలో రైల్వేకు సంబంధించిన డ్రైవింగ్, సిగ్నలింగ్ వ్యవస్థ, టికెట్ తనిఖీలు, ట్రాక్ పరిశీలన, రైల్వేస్టేషన్ల నిర్వహణ తదతర శిక్షణకు సంబంధించిన యూనిట్లను గద్వాలలో ఏర్పాటు చేయాలని గతం నుంచి డిమాండ్ ఉంది. దీనిపై పలుమార్లు ఎంపీలు ప్రయత్నిస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.
గద్వాలలో హాల్టింగ్‌లు ఏర్పాటు చేస్తే..
గద్వాల జంక్షన్‌లో రైళ్లహాల్టింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ట్రాల మధ్య రైళ్ల రాకపోకలను మరింతగా పెంచేందుకు అవకాశం ఉంటుంది. వా ణిజ్య, వ్యాపారరంగంలో ఇప్పటికే ముందంజలో ఉన్న గద్వాల ప్రాంత అభివృద్ధికి గద్వాల హాల్టింగ్ తోడ్పడుతుంది. గద్వాల -రాయిచూర్‌ల మధ్య రైళ్ల రాకపోకలు పెరగడంతో పాటు, గద్వాల నుంచి నంద్యాల, డోన్, మహ బూబ్‌నగర్‌ల మ ధ్య ని త్యం ప్యాసింజర్ రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచేందుకు వీలవుతుం ది. ఇకనైనా పార్లమెంట్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, రైల్వే ఉ న్నతాధికారులు, రైల్వేశాఖపై ఒత్తిడి పెంచి గద్వాల జంక్షన్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని ఈ ప్రాంతప్రజలు కోరుతున్నారు.