సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి తెలంగాణ మంత్రి కే తారకరామారావు బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్ లీగల్ నోటీసులు జారీచేశారు. రేవంత్‌రెడ్డి తనపై అసత్య ఆరోపణలు గుప్పించారని లీగల్ నోటీసులలో ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం గచ్చిబౌలిలో జరిగిన సన్‌బర్న్ పార్టీకిగానీ, ఇతర ఈవెంట్లతోగానీ తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో తనకు ఎలాంటి పబ్‌లు లేవని, తనపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని లీగల్ నోటీసులలో రాజేంద్రప్రసాద్ డిమాండ్ చేశారు.
Published Sat, Nov 25 2017 6:59 PM | Last Updated on Sat, Nov 25 2017 7:32 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment