ఖమ్మం(చర్ల): మావోయిస్టు పార్టీకి చెందిన ఒక దళ సభ్యుడితో పాటు నలుగురు మిలీషియా సభ్యులను అరెస్టు చేసినట్లు ఖమ్మం జిల్లా భద్రాచలం ఏఎస్‌పీ భాస్కరన్ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
సరిహద్దు చెన్నాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బలగాలు మొహరించారు. వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అల్లం నరేందర్, ఎస్సైలు ఎన్. రవీందర్, ప్రసాద్, సురేష్‌కుమార్, సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్, కోబ్రా 208 బెటాలియన్‌లు సంయుక్తంగా చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్‌లో ఐదురుగు వ్యక్తులు బలగాలకు తారసపడి పారిపోతున్నారు.
ఈ క్రమంలో బలగాలు వెంబడించి వారిని పట్టుకొని విచారించారు. వారిలో గోరుకొండకు చెందిన లచ్చన్న దళ సభ్యులు మడవి రామయ్య అలియాస్ గౌతమ్, బూరుగుపాడుకు చెందిన మిలీషియా సభ్యులు బాడిసె ఉంగయ్య, మడవి ఇడమయ్య, చెన్నాపురం వాసి మడకం గంగ, మడవి మూడ ఉన్నట్లు వివరించారు. నేరాలు అంగీకరించడంతో వారిని కోర్టుకు తరలించినట్లు ఏఎస్పీ పేర్కొన్నారు.
మావోయిస్టు దళ సభ్యుడు అరెస్టు
Published Mon, May 4 2015 10:46 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement