ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టాలి
శివాజీనగర్ : ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల దోపిడీని వెంటనే అరికట్టాలని పీడీఎస్‌యూ జి ల్లా అధ్యక్షుడు జి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరు లతో మాట్లాడారు. జిల్లాలో విద్యను వ్యాపారం చేస్తూ విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించకుండా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం గా విద్యాసంస్థలను నడుపుతున్నారన్నారు. పా ఠశాలల్లోనే పుస్తకాలు, నోట్‌పుస్తకాలు, స్టేష నరీ, డ్రెస్సులు, టె, బెల్టులు, షూ ఇతర సామగ్రిని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ, బడిని వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారని ఆరోపించారు.
తోకపేర్లను తొలగించాలని డిమాం డ్ చేశారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు లంచాలకు ఆశపడి గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో కార్పొరేట్ విద్యాసంస్థలను బహిష్కరించాలన్నారు. పాఠశాలల్లో నా ణ్యత లేని బస్సులను వాడుతున్నారని అ లాం టి వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సుధాకర్, జిల్లా కార్యదర్శి రాజు, నాయకులు గంగాధర్, క్రాం తికుమార్, ఆజాద్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.