ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి | Pulimamidi VRA Murdered by Sand mafia | Sakshi
Sakshi News home page

ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలి

Published Mon, Jun 1 2015 7:57 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Pulimamidi VRA Murdered by Sand mafia

నల్లగొండ (మోత్కూరు) : వీఆర్‌ఏను దారుణంగా హత్య చేసినవారిని కఠినంగా శిక్షించాలని నల్లగొండ వీఆర్‌ఏల సంఘం డిమాండ్ చేసింది. నల్లగొండ జిల్లా హాలియా మండలంలోని పులిమామిడి గ్రామ రెవెన్యూ సహాయకుడు(వీఆర్‌ఏ) దైద గిరిని ఆదివారం దారుణంగా హత్య చేసిన ఇసుక మాఫియాపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. సోమవారం వారు మోత్కూరులో విలేకరులతో మాట్లాడుతూ.. వీఆర్‌ఏ దైద గిరి కుటుంబాన్ని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలన్నారు. వీఆర్‌ఏలకు భద్రత కల్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement