‘గురుకుల నోటిఫికేషన్’పై కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. గురుకుల టీచర్ పోస్టులకు సంబంధించి నెలన్నర క్రితం టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ అందులో పేర్కొన్న నిబంధనలపై క్షేత్రస్థాయి నుంచి విమర్శలు, నిరసనలు వ్యక్తం కావడంతో టీఎస్‌పీఎస్సీ ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. ఈ క్రమంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తుందని అభ్యర్థులు ఆశించినప్పటికీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పంద నా లేదు. దీంతో కొత్త విద్యా సంవత్సరం ముంచుకొస్తుండడంతో ఆయా ఖాళీల్లో గెస్ట్‌టీచర్ల(తాత్కాలిక ఉపాధ్యాయులు)ను నియమించుకోవాలని గురుకుల సొసైటీ లు భావిస్తున్నాయి.
2017–18 విద్యా సంవత్సరంలో మహాత్మా జ్యోతిబాపూలే వెను కబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీబీసీఆర్‌ఈఐ ఎస్) పరిధిలో కొత్తగా 119 గురుకుల పాఠశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జూన్ 12న ప్రారంభించేందుకు ఆ సొసైటీ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియ ఊపందుకున్నప్పటికీ.. బోధకులు, సిబ్బంది నియామ కాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీంతో ఈ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో గెస్ట్ టీచర్లను నియమించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే విద్యా సంవ త్సరంలో 119 బీసీ గురుకుల పాఠశాలలు ప్రారం భం కానున్నాయి. వీటికి 714మంది టీచర్లు అవసరం. రెగ్యులర్ ఉపాధ్యా యులు వచ్చే వరకు గెస్ట్ టీచర్లను, ఔట్‌సోర్సింగ్ ద్వారా 238 మంది బోధనేతర సిబ్బందిని నియమించుకోనున్నారు. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సొసైటీ భావిస్తోంది.
కొత్త గురుకులాల్లో గెస్ట్ టీచర్లు!
Published Tue, Mar 21 2017 3:23 AM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM
Advertisement
Advertisement