ప్రమాదకరంగా పుష్కర యాత్ర
టేకులపల్లి (ఖమ్మం) : ఖమ్మం జిల్లాలో అన్ని దారులు భద్రాచలం గోదావరి పుష్కరాల వైపే. ఇల్లెందు నుంచి కొత్తగూడెం వయా టేకులపల్లి రహదారి ఎన్నడూ లేని విధంగా వాహనాలతో రద్దీగా ఉంది. మండలంతో పాటు, చుట్టు పక్కల గ్రామాలు, దూర ప్రాంతాలకు చెందిన భక్త జనం పుష్కరాలకు వెళ్ళడంపైనే శ్రద్ద పెడుతున్నారు. ప్రధానంగా ఆటోలు, ట్రాలీలలో లోడుకు మించి ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు.
ఎంత ప్రమాదమైనా డోన్ట్ కేర్ అంటూ అంతా గోదావరి మాత, సీతారాములపై భారం మోపి పుష్కరాలకు తరలివెళ్తున్నారు. తగ్గుముఖం పడుతుందని అనుకుంటే చివరి రోజుల్లో మరింత భక్త జనం అధిక సంఖ్యలో పుష్కరాలకు తరలి వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సుపైన కూడా వదలకుండా ప్రయాణం చేస్తుండటం విశేషం. ఈ పరిస్థితులపై పోలీసులు, అధికారులు జర నజర్ వేస్తే మంచిది.