బంగారు తెలంగాణ కాదు .. బాధల తెలంగాణ
మహేశ్వరం: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉద్యమించాలని మాజీ హోంమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు శివమూర్తి అధ్యక్షతన మంగళవారం మండలకేంద్రంలోని కాకి ఈశ్వ ర్ ఫంక్షన్ హాలులో కాంగ్రెస్ పార్టీ మం డల విస్తృతస్థాయి సమావేశం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ బం గారు తెలంగాణచేస్తానని బాధల తెలంగాణ చేస్తున్నారని దుయ్యబట్టారు. అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని ఆరోపించారు. సర్వేలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకొని రాజకీయ విలువలను దెబ్బతీస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులను ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వచ్చాయని చెప్పుకుంటూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. 2019లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ రాష్ర్ట యువనాయకుడు కార్తీక్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనలా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విమానాశ్రయం, ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్కు, ఐటీ పార్కులను నిర్మిస్తే.. కేసీఆర్ కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీలు స్థాపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ.. ప్రధాని పదవిని తృణప్రాయంగా వది లేసిన త్యాగశీలి సోనియా గాంధీ అన్నారు.
పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. సభ్య త్వ నమోదు ఒక యజ్ఞంలా నిర్వహిం చాలని కోరారు. ఈ నెలాఖరులోపు పార్టీ సభ్యత్వ నమోదును అన్ని గ్రామా ల్లో పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోద మాధవరెడ్డి, సీనియర్ నాయకులు కె.రఘుమారెడ్డి, ఇజ్రాయేల్, పీఏసీఎస్ చైర్మన్ పి. అంబయ్య యాదవ్, ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ స్వప్న, పార్టీ మం డల మాజీ అధ్యక్షుడు కె.దశరథ, నర్సిం హారెడ్డి, సురేష్, నవీన్, యాదయ్య, రాజు, శ్రీశైలం, రాములు,రాజేష్, అంజయ్య, రాఘవేందర్‌రెడ్డి, జి. నర్సిరెడ్డి, పర్వతాలు, ఎండి నాసర్‌ఖాన్, అదిల్, యాదగిరిగౌడ్ పాల్గొన్నారు.