ముస్తాబాద్ పంచాయతీలో కలకలం
ముస్తాబాద్ : పంచాయతీ సిబ్బంది ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ ముస్తాబాద్‌కు చెందిన చాకలి మహేష్(24) గురువారం పంచాయతీ కార్యాలయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మాహత్యాయత్నం చేశాడు. కిరోసిన్ డబ్బాతో పంచాయతీ వద్దకు చేరుకుని ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయగా అక్కడున్న సిబ్బంది అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టెబుల్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని కారణాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామంలో తమకున్న స్థలాన్ని ఇటీవల ఒకరికి విక్రరుుంచామని, అందు లో ఇంటి నిర్మాణం చేపట్టగా పంచాయతీ అధికారులు అడ్డుకున్నారని మహేష్ ఆరోపించాడు. నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్‌తోనే ఇంటి నిర్మా ణం చేపట్టామని, అరుుతే 150 గజాల్లో కొంత స్థలాన్ని దారికి వదిలి పెట్టాలంటూ అధికారులు అడ్డుకుం టున్నారని పేర్కొన్నాడు. ఎస్సై మారుతి మహేశ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఇంటి స్థలం విషయంలో వచ్చిన వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. దీనిపై పంచాయతీ ఈవో మాట్లాడుతూ ఇంటి నిర్మాణంపై వచ్చిన ఫిర్యాదుల మేరకే విచారణ చేపట్టామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నల్ల నర్సయ్య సూచించారు.
యువకుడి ఆత్మహత్యాయత్నం
Published Fri, May 15 2015 1:10 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement