విజయవాడ-హైదరాబాద్ రహ‘దారి’ మళ్లింపు | vijayawada to hyderabad route changed from sunday evening | Sakshi
Sakshi News home page

విజయవాడ-హైదరాబాద్ రహ‘దారి’ మళ్లింపు

Published Sun, Feb 8 2015 10:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

vijayawada to hyderabad route changed from sunday evening

నార్కెట్‌పల్లి: నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలో జరుగుతున్న లింగమంతుల స్వామి (గొల్లగట్టు) జాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రించడంలో భాగంగా విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి(65)ను దారి మళ్లించనున్నారు. నల్లగొండ జిల్లా సుర్యాపేట సమీపంలోని దురాజ్‌పల్లి వద్ద నేటినుంచి మూడురోజుల పాటు లింగమంతుల స్వామి జాతర జరగనుండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండటంతో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి హైదరాబాద్ - విజయవాడ వెళ్లే వాహనాలను నార్కెట్‌పల్లి, మిర్యాలగూడ, కోదాడల మీదుగా దారి మళ్లించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement