* ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంపై ఆగ్రహం
* కేఎం ప్రతాప్, జైపాల్‌రెడ్డి సోదరుడికి షోకాజ్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన 8 మంది జిల్లా స్థాయి నాయకులపై టీపీసీసీ బహిష్కరణ వేటు వేసింది. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారెడ్డి డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సోదరుడు సూదిని రాంరెడ్డిలను ఈనెల 12న టీపీసీసీ క్రమశిక్షణా సంఘం ఎదుట హాజరుకావాలని ఆదేశిస్తూ సంఘం చైర్మన్ ఎం.కోదండరెడ్డి నోటీసు జారీ చేశారు. బుధవారం ఉదయం టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కోదండరెడ్డి నేతృత్వంలోని క్రమశిక్షణా సంఘం సభ్యులు డీవీ సత్యనారాయణ, బండ ప్రకాష్, ఫరూఖ్ హుస్సేన్ సమావేశమయ్యారు. జిల్లాలవారీగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై చర్చించారు. అనంతరం 8 మంది నాయకులను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలిచ్చారు.
వేటు వీరిపైనే: మహబూబ్‌నగర్ జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పీసీసీ సభ్యుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన తలకొండ పీఏసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి. రంగారెడ్డి జిల్లాలో మాజీ జడ్పీటీసీ పాశం లక్ష్మీపతిగౌడ్(ఇబ్రహీంపట్నం), మాజీ జడ్పీటీసీ నోముల కృష్ణగౌడ్(హయత్‌నగర్), మాజీ జడ్పీటీసీ బుయ్యకృష్ణగౌడ్(హయత్‌నగర్), మాజీ ఎంపీపీ మల్‌రెడ్డి యాదిరెడ్డి(హయత్‌నగర్), మాజీ కోఆప్టెడ్ సభ్యుడు గౌస్ మొయినుద్దీన్(గౌరెల్లి), మాజీ సర్పంచ్ కందాటి కృష్ణారెడ్డి(కవాడిపల్లి).
8 మందిపై టీ-కాంగ్రెస్ వేటు
Published Thu, May 8 2014 12:53 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM
Advertisement
Advertisement