![ఎయిర్‌టెల్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు](/styles/webp/s3/article_images/2017/09/3/81430337564_625x300.jpg.webp?itok=cTjqzsCF)
ఎయిర్‌టెల్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ గ్లోబల్ సీఎఫ్‌వో బి.శ్రీకాంత్ తెలిపారు. సింహభాగం నిధులను భారత, దక్షిణాసియాలో కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నట్లు వివరించారు. 700-800 మిలియన్ డాలర్లను ఆఫ్రికాలో ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపారు.
మరోవైపు స్పెక్ట్రం కేటాయింపులు పూర్తయ్యాక కేరళ మినహా వివిధ సర్కిళ్లలో వొడాఫోన్, ఐడియాతో వివాదాస్పద 3జీ రోమింగ్ ఒప్పందాలు రద్దు చేసుకోనున్నట్లు కంపెనీ భారత విభాగం సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ తెలిపారు. తమకు స్పెక్ట్రం లేని సర్కిళ్లలో సైతం 3జీ సేవలు అందించేందుకు ఒకదాని నెట్‌వర్క్‌ను మరొకటి వినియోగించుకునేలా టెల్కోలు ఒప్పందాలు కుదుర్చుకోవడంపై వివాదం చెలరేగడం తెలిసిందే.