పాక్ మాజీ ప్రధాని గిలాని కుమారుడికి విముక్తి
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని యూసఫ్ రజా గిలానీ కుమారుడు అలీ హైదర్‌ను తాలిబాన్ చెర నుంచి భద్రతాదళాలు సురక్షితంగా కాపాడాయి. 2013 ఎన్నికల ర్యాలీ సమయంలో హైదర్ ను అల్ కాయిదా ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అతణ్ని అఫ్గాన్ ప్రత్యేక కమెండోలు, అమెరికా భద్రతాదళాలు సంయుక్త ఆపరేషన్ జరిపి రక్షించారు ఈ విషయాన్ని పాక్ ప్రధాని సలహాదారుఅజీజ్‌కు అఫ్గాన్ జాతీయ భద్రతా సలహాదారుడు ఫోన్‌లో తెలిపారు. అఫ్గానిస్తాన్‌లోని పాక్ సరిహద్దులో ఉన్న పక్తియా ప్రావిన్స్‌లో హైదర్‌ను కాపాడినట్లు, ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నారు. హైదర్‌కు కాబూల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించాక పాక్‌కు పంపనున్నారు.