భోపాల్: భారత చరిత్రలోనే భయానక విషాదంగా భావించే భోపాల్ గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగి 33 ఏళ్లు కావాస్తున్నా బాధితులకు అరకొర సాయమే అందుతోంది. విశపూరిత వాయువులు పీల్చి, ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతోన్న 30 వేల మందికి బాధితులకు స్మార్ట్ కార్డులు మంజూరుచేశామని భోపాల్ గ్యాస్ బాధితుల పునరావాస శాఖ(మధ్యప్రదేశ్) మంత్రి విశ్వాస్ సారంగ్ శనివారం మీడియాకు చెప్పారు. బాధితుడు లేదా బాధితురాలికి ఎదుర్కొంటున్న జబ్బు, వారికి అందిస్తున్న చికిత్సా విధానం తదితర వివరాలన్నీ స్మార్ట్ కార్డులో పొందుపర్చామని మంత్రి తెలిపారు. భోపాల్ మెమోరియల్ హాస్పిటల్, పునరావాస శాఖలు సుహృద్భావంతో బాధితులను ఆదుకుంటాయని అన్నారు. భోపాల్ పట్టణంలోని ఆరు ఆసుపత్రుల్లో గ్యాస్ ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్నామని, ఇప్పటి వరకు సుమారు రూ.11.43 కోట్ల రూపాయలను ఖర్చుచేశామని మంత్రి విశ్వాస్ తెలిపారు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో పురుగుమందులు తయారుచేసే యూనియన్ కార్బైడ్ పరిశ్రమ నుంచి 1984 డిసెంబర్ 2 అర్ధరాత్రి మిథైల్ ఐసో సయనైడ్ అనే విషరసాయనం లీకైన ఘటనలో 25 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. విషవాయువును పీల్చి ఐదు లక్షల మందికిపైగా భయంకరమైన వ్యాధుల బారినపడ్డారు. ఆ బాధితులు వారి పిల్లలు కలిపి సుమారు లక్షమంది నేటికీ రకరకాల అనారోగ్యాలతో బాధపడుతున్నారు. భోపాల్ గ్యాస్ లీకేజీ బాధితుల పునరావాస శాఖ పేరుతో మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. బాధితుల కోసం అమలవుతోన్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది.
‘భోపాల్ గ్యాస్’బాధితులకు స్మార్ట్ కార్డులు
Published Sat, Dec 3 2016 4:39 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
Advertisement
Advertisement