'సీఈవో హత్యపై ఉన్నతస్థాయి విచారణ' | CEO killing: Congress demands high-level, impartial probe | Sakshi
Sakshi News home page

'సీఈవో హత్యపై ఉన్నతస్థాయి విచారణ'

Published Mon, Jun 16 2014 7:16 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

CEO killing: Congress demands high-level, impartial probe

కోల్కతా: నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హత్య కేసుపై ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ కేసులో నిజానిజాలు వెల్లడికావాలంటే ఉన్నతస్థాయిలో నిష్పక్షపాత విచారణ జరపాలని పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే మనాస్ భునియా డిమాండ్ చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని ఆయన సూచించారు. ఇటువంటి ఘటనలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు.

హుగ్లీ జిల్లాలో భద్రేశ్వర్ వద్దనున్న నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హెచ్ కే మహేశ్వరిని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా కొట్టడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement