హింసకు పాల్పడితే సహించం: మమత | Mamata Banerjee assures industry that violence will not be tolerated | Sakshi
Sakshi News home page

హింసకు పాల్పడితే సహించం: మమత

Published Mon, Jun 16 2014 3:05 PM | Last Updated on Sat, Sep 2 2017 8:54 AM

హింసకు పాల్పడితే సహించం: మమత

హింసకు పాల్పడితే సహించం: మమత

కోల్కతా: కార్మిక సంఘాల పేరుతో హింసకు పాల్పడితే సహించబోమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించారు. హుగ్లీ జిల్లాలో నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హతమార్చిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారని శాసనసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కేసులో న్యాయం జరిగేలా చూస్తామని హామీయిచ్చారు. హత్య వెనుక ఎంతటి పెద్దవారున్నా వెనుకాడబోమన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదన్నారు.

సీఐటీయు, బీఎంఎస్ కార్మిక సంఘాల్లోని కొన్ని శక్తులు ఈ దురదృష్టకర సంఘటనకు కారణమని మమత బెనర్జీ ఆరోపించారు. ఈ రెండు కార్మిక సంఘాల్లో ఒకటి సీపీఎం, మరోటి బీజేపీకి చెందనవి కావడం గమనార్హం. భద్రేశ్వర్ వద్దనున్న  నార్త్బ్రూక్ జూట్ మిల్లు సీఈవో హెచ్ కే మహేశ్వరిని కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రంగా కొట్టడంతో ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మనోజ్ చక్రవర్తి డిమాండ్ ను మమతా బెనర్జీ తిరస్కరించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement