షాకింగ్: విడాకులు ఇచ్చినా.. పెట్రోలు పోసి!!
షాకింగ్: విడాకులు ఇచ్చినా.. పెట్రోలు పోసి!!
Published Thu, Jan 12 2017 5:11 PM | Last Updated on Mon, Aug 13 2018 3:34 PM
చైనాలో షాకింగ్ ఘటన ఒకటి జరిగింది. విడాకులు ఇచ్చిన కొద్ది సేపటికే తన మాజీ భార్యపై ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. ఈశాన్య చైనాలోని పన్షి నగరంలో ఈ ఘటన జరిగింది. విడాకుల కార్యాలయంలోని సిబ్బంది వెంటనే ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆమె జుట్టు కాలుతూ ఉంది. ఇంత జరుగుతున్నా.. ఆ మాజీ భర్త మాత్రం ఏమీ ఎరగనట్లు నెమ్మదిగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడి సీసీటీవీ కెమెరాలలో రికార్డయింది. 36 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను మియావోపాయ్ అనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
వీడియోలో ఆ వ్యక్తి తొడమీద కూడా మంటలు అంటుకుంటాయి. అతడు బయటకు వచ్చి, నెమ్మదిగా ఆ మంటలు ఆర్పుకుని, అక్కడినుంచి వెనక్కి తిరిగి చూడకుండా నడిచి వెళ్లిపోతాడు. తర్వాత అతడి మాజీ భార్య తన జుట్టుకు మంటలు అంటుకుని ఉండగా లోపలి నుంచి పరిగెత్తుకుంటూ వస్తుంది. దాంతో ఇద్దరు వ్యక్తులు పరుగున వచ్చి ఆమె జుట్టు మీద ఉన్న మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె తన ఒంటి మీద కాలుతున్న దుస్తులను కూడా విప్పేసేందుకు ప్రయత్నం చేస్తుంది.
కొద్దిసేపటి తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి అగ్నిమాపక పరికరంతో మంటలు ఆర్పుతారు. అదేరోజు ఉదయం దంపతులిద్దరికీ విడాకులు మంజూరయ్యాయి. అతడు తన మాజీ భార్యను తీవ్రంగా ద్వేషించడం వల్లే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లు తెలుస్తోంది. అతడిపై కేసు పెడతారా లేదా అన్నది ఇంకా తెలియలేదు.
Advertisement
Advertisement