గూగుల్ నెక్సస్ 5.. హాట్‌కేక్! | Google Nexus 5 sales soar in India, Android smartphone sold out ... | Sakshi
Sakshi News home page

గూగుల్ నెక్సస్ 5.. హాట్‌కేక్!

Published Wed, Nov 27 2013 12:16 AM | Last Updated on Sat, Aug 18 2018 4:45 PM

గూగుల్ నెక్సస్ 5.. హాట్‌కేక్! - Sakshi

గూగుల్ నెక్సస్ 5.. హాట్‌కేక్!

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గూగుల్ ఇటీవల ఎల్‌జీతో కలిసి విడుదల చేసిన ‘నెక్సస్ 5’ స్మార్ట్‌ఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. గూగుల్ బ్రాండ్ ఇమేజ్‌కు తోడు రూ.50 వేలు, ఆపై ధర గల మోడల్స్‌లో ఉన్న ఫీచర్లను రూ.30 వేలకే అందిస్తుండంతో కస్టమర్లు క్యూ కడుతున్నారు. భారత్‌లోనూ నెక్సస్ 5 హోట్‌కేక్‌లా అమ్ముడవడం విశేషం. ఆపిల్ 5ఎస్ తర్వాత దేశంలో అతి వేగంగా అమ్ముడైన మోడల్ ఇదేనని రిటైలర్లు చెబుతున్నారు. ఈ నెల 20న దేశీయ మార్కెట్లో నెక్సస్ 5 విడుదలైంది. విడుద లైన కొద్ది గంటల్లోనే గూగుల్ ప్లే స్టోర్‌లో ‘స్టాక్ లేదు’ అనే సందేశం దర్శనమిచ్చిందంటే దీనికున్న డిమాండ్ ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుతం దేశంలోని రిటైల్ ఔట్‌లెట్లలో స్టాక్ పూర్తిగా అయిపోయినట్టు సమాచారం.
 
 రెండు రోజుల్లో 32 జీబీ..
 ఈ నెల 20న తొలి విడతగా నెక్సస్ 5 మోడల్ 15,000 యూనిట్లు భారత్‌కు వచ్చాయి. ఇందులో 5,000 పీసులు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా విక్రయిం చారు. మిగిలినవి రిటైలర్ల ద్వారా మార్కెట్లో అమ్ముడయ్యాయి. తొలి లాట్‌లో పూర్తిగా 16 జీబీ మోడల్‌ను మాత్రమే విడుదల చేశారు. దీని ధర రూ.28,999 ఉంది. రెండు రోజుల్లో రెండవ లాట్ విడుదల కానుంది. ఈ లాట్‌లో 16జీబీతోపాటు 32 జీబీ మోడల్స్‌నూ ప్రవేశపెట్టనున్నారు. 32 జీబీ ధర రూ.32,999. అందుబాటు ధరలో ఇవి లభించడం కూడా డిమాండ్‌కు కారణమని రిటైలర్లు అంటున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రస్తుతం అమ్మకాల పరంగా తొలి స్థానం నెక్సస్ 5 అని చెబుతున్నారు.
 
 తొలిసారిగా 4.4 కిట్‌క్యాట్‌తో..
 గూగుల్ నూతన ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్‌తో తొలిసారి తయారైన మోడల్ నెక్సస్ 5. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 2.26 గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, 4.95 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 8 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా, వైర్‌లెస్ చార్జింగ్ తదితర ఫీచర్లున్నాయి. 4జీ ఎల్‌టీఈ సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 2,300 ఎంఏహెచ్. బ్రౌజింగ్ వేగం, ప్రాసెసర్ పనితీరు, స్క్రీన్ వేగం, ఫ్రేమ్స్ పర్ సెకన్, జావా స్క్రిప్ట్ వంటి అంశాల పరంగా చూస్తే.. నెక్సస్ 5 తొలి 3 స్థానాల్లో ఉంటుందని హైదరాబాద్‌కు చెం దిన ఆన్‌డ్రాయిడ్ డెవలపర్ అబ్దుర్ రెహ్మాన్ తెలి పారు. దేశీ స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లో ఈ మోడల్ కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలున్నాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement