నోట్ల రద్దుపై చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలు!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ వరుసగా ఇస్తున్న ఆదేశాలను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది. నోట్ల రద్దు తర్వాత గడిచిన 43 రోజుల్లో ఆర్బీఐ 126సార్లు నిబంధనలు మార్చిందని, ఆర్బీఐ తీరు చూస్తుంటే.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కాస్తా రివర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు.
ఇక పెద్దనోట్ల రద్దుపై ప్రభుత్వ ఆదేశాలను తప్పుబడుతూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ట్విట్టర్‌లో ఒక ఫొటో పోస్టు చేశారు. ఏకకాలంలో అనేక సిగ్నల్ లైట్లు వెలుగుతున్నట్టు ఉన్న ఈ ఫొటోతో ప్రభుత్వ ఆదేశాలు ఎంత గందరగోళంగా ఉన్నాయో రాహుల్ చమత్కరించారు.
Government orders after demonetisation: pic.twitter.com/5D5p0XX4MO
— Office of RG (@OfficeOfRG) 21 December 2016