55 శాతం మేర పెరిగిన 'మందుబాబులు'
ముంబై: భారత్లో 'మందు బాబుల' సంఖ్య రోజురోజూకు పెరుగుతుందా ? అంటే అవుననే అంటున్నాయి నివేదికలు. గత 20 ఏళ్ల కాలవ్యవధిలో భారత్లో మందుబాబుల శాతం 55 మేరకు పెరిగిందంటా. ఈ విషయాన్ని పారిస్కు చెందిన ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఅపరేషన్ అండ్ డెవెలప్‌మెంట్ ( ఓఈసీడీ) ఇటీవల ప్రచురించిన తన నివేదికలో వెల్లడించింది.
మొత్తం 40 దేశాల జాబితాలో భారత్ మూడో స్థానంలో ఉందని పేర్కొంది. మొదటి మూడు స్థానాలు వరుసగా చైనా, ఇజ్రాయిల్, బ్రెజిల్ దేశాలు అక్రమించాయని పేర్కొంది. వివిధ దేశాలలో యువకులతోపాటు మహిళలు కూడా సేవించడం పట్ల ఓఈసీడీ ఆందోళన వ్యక్తం చేసింది.