సల్మాన్ తీర్పుపై ఎవరేమన్నారంటే...
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంతో విభిన్న స్పందన వ్యక్తమైంది. కోర్టు తీర్పును బాలీవుడ్ స్వాగతించింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేయాలని సీనియర్ లాయర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోర్టు తీర్పుపై ఎవరేమన్నారంటే...
* హైకోర్టు తీర్పును పరిశీలించిన తర్వాత ఏవిధంగా ముందుకు వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటాం: మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
* చిత్రపరిశ్రమకు చెందిన నటిగా, స్నేహితురాలిగా సల్మాన్ ఖాన్ కు విముక్తి లభించడం నాకెంతో సంతోషం కలిగించింది. అతడికి దేవుడి ఆశీస్సులుంటాయి: సీనియర్ నటి, బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్
* కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, న్యాయస్థానం ఆదేశాలను శిరసావహిస్తాం: బాబూలాల్ సుప్రియో
* చాలా సంతోషంగా ఉన్నా, బాంబే హైకోర్టుకు అభినందనలు: ప్రముఖ రచయిత్రి శోభా డే
* హైకోర్టును తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తుందని ఆశిస్తున్నా: సీనియర్ లాయర్ అభా సింగ్
* సల్మాన్ వ్యక్తిగత జీవితంపై హిట్ అండ్ రన్ కేసు ప్రభావం చూపింది. యువకుడిగా ఉన్నప్పుడే అతడు పెళ్లిచేసుకోవాల్సివుంది. అతడికి ఇప్పుడు 50 ఏళ్లు వచ్చాయి: దర్శకనిర్మాత సుభాష్ ఘాయ్