మరుగుదొడ్డి కట్టించలేదని విడాకులు | No toilet at home: Bihar woman divorces husband | Sakshi
Sakshi News home page

మరుగుదొడ్డి కట్టించలేదని విడాకులు

Published Tue, May 12 2015 6:23 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

మరుగుదొడ్డి కట్టించలేదని విడాకులు - Sakshi

మరుగుదొడ్డి కట్టించలేదని విడాకులు

పాట్నా: నాలుగేళ్లుగా పోరుతున్నా ఇంట్లో మరుగుదొడ్డి కట్టించని మగనికి ఓ భార్య విడాకులు ఇచ్చింది. టాయిలెట్ కట్టించలేదన్న కారణంతో బీహార్ లోని వైశాలి జిల్లా పహర్పూర్ గ్రామానికి చెందిన సునీతా దేవి తన భర్త నుంచి విడిపోయింది. మరుగుదొడ్డి కట్టించకపోవడంతో తన భర్తను వదిలేశానని ఆమె మీడియాకు తెలిపింది.

'ఇంట్లో టాయిలెట్ కట్టించమని నాలుగేళ్లు చెబుతున్నా నా భర్త పట్టించుకోలేదు. ప్రతిరోజు చీకట్లో బహిర్భూమి వెళ్లాల్సి వచ్చేది. దీనికి తోడు ఆ భూమి తాలూకు యజమానులు తిట్టడం, కొట్టడం చేశారు' అని సునీత వాపోయింది. ఇంట్లో మరుగుదొడ్డి ఉంటే ఈ అవమానాలన్నీ ఉండేవికావని, కానీ తన భర్త తన మాట పెడచెవిన పెట్టాడని తెలిపింది. బీహార్ జనాభా సుమారు పదిన్నర కోట్లు. వీరిలో 2 కోట్ల మందికి మరుగుదొడ్డి సాదుపాయం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement