ఆమె ట్రంప్కు మద్దతు.. నేను రాజీనామా
ఆమె ట్రంప్కు మద్దతు.. నేను రాజీనామా
Published Wed, Dec 21 2016 9:33 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
సాప్ట్వేర్ దిగ్గజాలో ఒకటైన ఒరాకిల్ కంపెనీ సీఈవో సాఫ్రా కాట్జ్ అమెరికాకు ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా నిలుస్తున్నారనే నెపంతో తన పదవికే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఓ సీనియర్ అధికారి. ట్రంప్ టీమ్లో సాఫ్రా కాట్జ్ జాయిన్ అయ్యారని మండిపడుతూ ఒరాకిల్ డైరెక్టర్ జార్జ్ ఏ. పొలిస్నర్ తన రాజీనామా లేఖను లింక్డ్ఇన్ ద్వారా కంపెనీకి పంపించారు. ట్రంప్ పరివర్తన టీమ్లో జాయిన్ అవుతూ సోషల్ సెక్యురిటీ, మెడికేర్, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై తాము పనిచేస్తామని కాట్జ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే తాను ట్రంప్తో కలిసి పనిచేసేది లేదని, ఎట్టిపరిస్థితిల్లో ట్రంప్కు సాయపడనని పేర్కొంటూ జార్జ్ ఒరాకిల్ కంపెనీకి లేఖ రాశారు. ట్రంప్ విధానాలు రాజ్యాంగ విరుద్ధం, అనైతికం, నేరపూరితంగా ఉంటాయని ఆరోపించారు. ప్రతి సందర్భంలోనూ చట్టబద్ధంగా ఆయన్ను నేను వ్యతిరేసిస్తానని పేర్కొన్నారు.
లింక్డ్ఇన్లో ఆయన పోస్టు చేసిన ఈ లేఖకు కనీసం 90 కామెంట్లు వచ్చాయి. వాటిలో చాలావరకు జార్జ్కు మద్దతుగా నిలిచాయి. అయితే ఈ విషయంపై కంపెనీ అధికార ప్రతినిధి స్పందించలేదు. 1993 నుంచి జార్జ్ పొలిస్నర్ ఒరాకిల్లో పనిచేస్తున్నారు. ఒరాకిల్లో జాయిన్ అయిన దగ్గర్నుంచి వివిధ పదోన్నతులకు ఆయన బాధ్యత వహించారు. కన్సల్టింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, కస్టమర్ అడ్వకసీ, ప్రొగ్రామ్ మేనేజ్మెంట్, క్లౌడ్ వంటి వాటిలో ఆయన పనిచేశారు. డిసెంబర్ 15న టెక్ దిగ్గజాలతో ట్రంప్ నిర్వహించిన భేటీ అనంతరం కాట్జ్ ఆయనతో కలిసి పనిచేయనున్నట్టు వెల్లడించారు. ఒరాకిల్ సీఈవోగా ఉన్నంతవరకు ట్రంప్తోనే కలిసి పనిచేస్తానని తెలిపిన సంగతి తెలిసిందే.
Advertisement