పాక్లో ఏడుగురు తాలిబన్ ఖైదీలను విడుదల! | Pakistan releases seven Taliban prisoners | Sakshi
Sakshi News home page

పాక్లో ఏడుగురు తాలిబన్ ఖైదీలను విడుదల!

Published Sat, Sep 7 2013 3:01 PM | Last Updated on Thu, Mar 28 2019 6:08 PM

Pakistan releases seven Taliban prisoners

దేశంలోని వివిధ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు తాలిబన్ ఖైదీలను విడుదల చేస్తున్నట్లు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. తాలిబన్ ఖైదీల్లో మన్సుర్ దదుల్లా, సయ్యద్ వాలి, అబ్దుల్ మన్నన్, కరీం అగ్, షెర్ అఫ్జల్, గుల్ మహ్మద్, మహ్మద్ జయ్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఆఫ్ఘానిస్థాన్ దేశంలో శాంతిని పునర్ నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఆ నిర్ణయం తీసుకున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

గత వారం రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆఫ్ఘాన్ దేశాధ్యక్షుడు హమీద్ కర్జాయి పాకిస్థాన్లో పర్యటించారు. ఆ మరుసటి వారంలోనే పాక్ ప్రభుత్వం ఆఫ్ఘాన్కు అనుకూలంగా అలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదికాక పాక్ ప్రధానిగా నవాజ్ షరీఫ్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా కర్జాయి ఆ దేశంలో పర్యటించారు. అందులోభాగంగా నవాజ్తోపాటు ఆ దేశ కీలకనేతలతో కర్జాయి భేటీ అయ్యారు. గతేడాది ఆఫ్ఘానిస్థాన్కు చెందిన 26 మంది తాలిబన్ ఖైదీలను విడుదల చేసిన సంగతిని పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా గుర్తు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement