జంతువులతోనూ రేప్ కేసు నిందితుడు.. | Perumbavoor rape and murder accused committed sexual offences with goa | Sakshi
Sakshi News home page

జంతువులతోనూ రేప్ కేసు నిందితుడు..

Published Sat, Jul 2 2016 8:58 AM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

జంతువులతోనూ రేప్ కేసు నిందితుడు.. - Sakshi

జంతువులతోనూ రేప్ కేసు నిందితుడు..

కోచి: కేరళలోని పెరుంబవూరులో దళిత మహిళను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో నిందితుడిపై మరో కేసు నమోదైంది. జంతువులతోనూ లైంగిక చర్యలకు పాల్పడినట్టు నిందితుడు అమీరుల్ ఇస్లాం పోలీసుల విచారణలో చెప్పాడు. అసోం నుంచి వలస కార్మికుడిగా కేరళకు వచ్చిన అమీరుల్ పెరుంబవూరులో బస చేసిన లాడ్జి పక్కన మేకతో అసహజ కార్యకలాపాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

నిందితుడు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు విచారణ చేయగా, మేక గాయపడినట్టు గుర్తించారు. లాడ్జి యజమాని ఫిర్యాదు మేరకు అమీరుల్పై కేసు నమోదు చేశారు. దళిత మహిళను అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో అమీరుల్ను గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీ అనంతరం కోర్టులో హాజరుపరచగా, అతనికి ఈ నెల 13 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement