ప్రధాన రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కారు సేవలు..! | Railways soon to start battery car service at major stations | Sakshi
Sakshi News home page

ప్రధాన రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కారు సేవలు..!

Published Mon, Jul 11 2016 12:22 PM | Last Updated on Mon, Sep 4 2017 4:37 AM

ప్రధాన రైల్వే  స్టేషన్లలో బ్యాటరీ కారు సేవలు..!

ప్రధాన రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కారు సేవలు..!

న్యూఢిల్లీ : ప్లాట్ ఫామ్ ల్లో ప్రయాణికుల కదలికలకు... ముఖ్యంగా వృద్ధుల, వికలాంగుల తరలింపు ఇబ్బందులను రైల్వే తొలగించనుంది. వీరి తరలింపు కోసం అన్నిప్రధాన రైల్వేస్టేషన్లలో బ్యాటరీ కారు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.  త్వరలోనే ఈ బ్యాటరీ కారు సర్వీసులను ప్రవేశపెట్టేందుకు కేంద్రప్రభుత్వం, రైల్వే డిపార్ట్ మెంట్ సిద్ధమవుతోంది. వృద్ధుల తరలింపునకు బ్యాటరీ కార్లు, వీల్ ఛైర్లు అన్ని ప్రధాన స్టేషన్లలో అందుబాటులో ఉంచుతామని  గత బడ్జెట్ లోనే రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బ్యాటరీ ఆపరేటడ్ కారు సర్వీసులను త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు.

అయితే ప్రయాణికులు ఈ సర్వీసులకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో రైల్వే స్టేషన్లలో రెగ్యులర్ గా ఈ సర్వీసులను రైల్వే నడపనుంది. దీనికోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ అప్లికేషన్ ను కూడా రైల్వే త్వరలోనే ఆవిష్కరించనుంది. వీల్ చైర్లు, హెల్పర్లు కావాలనుకున్న వారు ఈ యాప్ ద్వారా సర్వీసులను పొందే అవకాశం ఉంటుంది. అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ కార్లను బుక్ చేసుకోవడానికి ఓ మొబైల్ నెంబర్ ను కూడా ప్రతి స్టేషన్ లో అందుబాటులో ఉంచనున్నారు. ఐఆర్సీటీసీ ఈ-టికెటింగ్ వెబ్ సైట్, 139 హెల్ప్ లైన్ లో కూడా ఈ సర్వీసులను ప్రయాణికులు పొందవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ లేదా డైరెక్ట్ గా రైల్వే స్టేషన్ లో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లోనైనా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement