రెనాల్ట్-నిస్సాన్లు జతకట్టి...
బ్యూనస్ ఎయిర్స్ : అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు రెనాల్ట్, నిస్సాన్ అలయెన్స్ లో అర్జెంటీనాలో 800 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్టు ప్రకటించాయి. అర్జెంటినా ప్రెసిడెంట్ మారికో మాక్రితో భేటీ అనంతరం రెనాల్ట్-నిస్సాన్ చైర్మన్, సీఈవో కార్లోస్ ఘోసన్ శుక్రవారం ఈ పెట్టుబడి విషయాన్ని వెల్లడించారు.ఈ ప్లాన్ ప్రకారం ప్రత్యక్షంగా వెయ్యి ఉద్యోగాలు, పరోక్షంగా రెండు వేల ఉద్యోగాలు సృష్టించబోతున్నట్టు తెలిపారు.
నిస్సాన్ ఎన్పీ300 ఫ్రాంటీయర్, రెనాల్ట్ ఆలాస్కాన్ వంటి మొదటి లైన్ ఫాబ్రికేషన్ల ఆవిష్కరణల కోసం 600 మిలియన్ డాలర్లను పెట్టుబడులను వెచ్చిస్తామని చెప్పారు. రెనాల్ట్ సాండెరో, సాండెరో స్టెప్వే,లోగాన్ మోడల్స్ ఉత్పత్తికి మరో 100 మిలియన్ డాలర్లను వెచ్చిస్తామని ఈ కార్ల తయారీ అలయెన్స్ తెలిపింది. మరో 100 మిలియన్ డాలర్లను కొత్త మోడల్ ఉత్పత్తికి కేటాయిస్తామని పేర్కొన్నారు. .